విశాఖలోని అక్కయ్యపాలెంలో దారుణం జరిగింది. కరెంట్ తీగ ఓ మనిషి ప్రాణాలు నిలువునా పోయాయి. శుక్రవారం తెల్లవారు జామున అక్కయ్య పాలెం జీవన్ క్లినిక్ ఎదురుగా ఉన్న ఇంటి పనిమనిషి కరెంట్ షాక్ తో మృతి చెందింది.

సదరు మహిళ వాకిలి శుభ్రం చేసేందుకు బయటకు వచ్చింది. అక్కడ అడ్డంగా ఉన్న విద్యుత్ తీగను మామూలు కేబుల్ వైర్ అనుకుంది. దాన్ని పక్కకు జరిపి ఊడుద్దామని పట్టుకుంది. అంతే హై వోల్టేజీ కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందింది. 

ఈ ఘటన పై స్థానికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇక్కడ ఉన్న విద్యుత్ స్తంభాలు, స్తంభాలుకి ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను సకాలంలో తొలగించక పోవడంతో రాపిడి వల్ల తీగలు తెగి పడుతున్నాయని ఆరోపించారు. 

విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం  వల్ల  ఎంతమంది ప్రాణాలు  బలి ఇవ్వాల్సివస్తుందో అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది  నిర్లక్ష్యం వీడి  విద్యుత్ స్తంభాలు పై దృష్టి సారించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం  ద్వారా మృతి చెందిన పేద మహిళ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు  కోరుతున్నారు.