పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో యువతి కన్నుమూయగా.. యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయవాడ గాంధీనగర్ కు  చెందిన నాగగౌతమి, లోకేష్ లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో ప్రియురాలు నాగగౌతమి అక్కడికక్కడే మృతి చెందగా, ప్రియుడు లోకేష్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాంధీనగర్‌ జగపతి హోటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు గుడివాడకు చెందిన వ్యక్తి కాగా, మృతురాలు నాగ గౌతమి ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌గా పనిచేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.