తుని: తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద ప్లాస్టిక్ మూటలో ఓ మహిళ శవం కనిపించింది. దీంతో స్థానికంగా కలకలం చెలరేగింది. మహిళ వయస్సు 40 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ఎక్కడో చంపేసి ప్లాస్టిక్ మూటలో కట్టి మహిళ శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలేసి వెళ్లారని భావిస్తున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత రద్దీ తక్కువగా ఉన్న సమయంలో దుండగులు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. 

పోలీసులు సిసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళ ముఖం ఉబ్బి ఉంది. ఆమెను రెండు మూడు రోజుల క్రితం హత్య చేసి ఉంటారని అనుకుంటున్నారు. ఆమెను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

శవం దాదాపుగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఆ కారణంగానే ఆమెను కొద్ది రోజుల క్రితమే చంపి ఉంటారని అనుకుంటున్నారు.