Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్నంలో దారుణం.. నీళ్ల డ్రమ్ములో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం.. చంపి, ముక్కలు చేసి..

విశాఖలోని ఓ ఇంట్లోని డ్రమ్ములో మహిళ మృతదేహం కలకలం రేపింది. ఆ మృతదేహం ముక్కలుగా నరికి, కుళ్లిన స్థితిలో ఉండడం స్థానికంగా భయాందోళనలకు గురి చేస్తోంది. 

woman dead body found in water drum in visakhapatnam
Author
First Published Dec 5, 2022, 7:30 AM IST

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగు చూసింది. మధురవాడ పరిధిలోని కొమ్మాది వికలాంగుల కాలనీలోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.  కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోని నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం దొరికింది. అది పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పీఎంపాలెం పోలీసులు దీనిమీద తెలిపిన వివరాల ప్రకారం.. నండూరి రమేష్ అనే వ్యక్తికి  వికలాంగుల కాలనీలో ఒక ఇల్లు ఉంది. అతను ఎండాడలో వెల్డింగ్ దుకాణం నడుపుతున్నాడు. రమేష్ దగ్గర దుకాణంలో ఋషి అనే యువకుడు రెండేళ్ల క్రితం పనిలో చేరాడు. 

అతనికి అద్దె ఇల్లు కావాలంటే.. తాను ఉండే కాలనీలోని తన ఇంటిని అద్దెకి ఇచ్చాడు. రుషికి పెళ్లయింది. ఒక కూతురు కూడా ఉంది. వీరంతా కలిసి ఆ ఇంట్లో ఉండేవారు. ఈ క్రమంలో 2 నెలల క్రితం రుషి పనిమానేసి వెళ్లిపోయాడు. తన భార్య గర్భవతి అని..  ఆమెను పుట్టింటికి పంపించానని.. తానొక్కడే ఇక్కడ ఉండడం కుదరదు.. కాబట్టి తాను కూడా వెళ్ళిపోతున్నాను అని చెప్పి..  పని మానేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కాగా, గత రెండు రోజులుగా ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడం ప్రారంభించింది.

బాపట్ల జిల్లా తిప్పకట్టలో గ్యాస్ సిలిండర్ పేలుడు: ముగ్గురికి గాయాలు

దీంతో ఆ వాసన తట్టుకోలేని చుట్టుపక్కలవారు ఇంటి యజమాని అయిన రమేష్ కు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు రమేష్ అక్కడికి వచ్చి తాళం తీసి చూడగా.. వాసన ఇంకా ఎక్కువైంది. ఇంట్లో ఉన్న నీళ్ల డ్రమ్ము లో నుంచి  ఆవాసన వస్తున్నట్టు గమనించాడు.  దాన్ని తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించింది.  మృతదేహం ముక్కలు చేసి ఉంది.  కుళ్లిపోయిన స్థితిలో ఉంది. వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో నార్త్ జోన్ సబ్ డివిజన్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్, సీఐ వై రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

మృతదేహానికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు అది ఓ మహిళ మృతదేహంగా గుర్తించారు. అయితే ఆ మహిళ అంతకుముందు ఆ ఇంట్లో కిరాయికి ఉన్న మహిళనా? లేకపోతే ఇంకా ఎవరినైనా తీసుకు వచ్చి హత్య చేశారా?  శవాన్ని ఇక్కడ దాచి పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే, దీని మీద పోలీసులు రమేష్ ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లుగా  సమాచారం. దీంతో పోలీసులు ఈ కేసు మీద  లోతుగా విచారణ ప్రారంభించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios