టూటౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుకన్య ఆదివారం వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
చెట్టుకు ఉరివేసుకొని ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Add Asianetnews Telugu as a Preferred Source

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం, కార్తికేయపురానికి చెందిన సుకన్య అనే యువతి మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. తిరుమల టూటౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుకన్య ఆదివారం వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుకన్య ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
