ఓ యువతి పట్ల ఆమె పినతల్లి కర్కశంగా ప్రవర్తించింది. చుట్టపు చూపుగా వచ్చిన యువతిని అసభ్యరీతిలో ఫోటోలు తీసి... అనంతరం డబ్బు కోసం ఆ ఫోటోలను చూపించి బెదిరించింది. ఆమె బెదిరింపులు తట్టుకోలేక పోయిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్లలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నరసరావుపేటకు చెందిన యువతి మండల పరిధిలోని బుక్కాపురంలో ఉంటున్న పినతల్లి వద్దకు అప్పుడప్పడూ వస్తూ ఉండేది. చుట్టంచూపుగా పిన్ని వద్దకు వచ్చి పోతూ ఆమె యోగ క్షేమాలు తెలుసుకునేది. మంచితనంతో వచ్చిన యువతి పట్ల ఆమె పినతల్లి తన దుర్భుద్ధి చూపెట్టింది.

AlsoRead పిచ్చివాడు అన్నారని... కన్న తల్లిదండ్రులనే...

నెల రోజుల క్రితం తన ఇంటికి వచ్చిన యువతికి ఆమె పిన్ని మత్తుమందు ఇచ్చింది. మత్తులో స్పృహ కోల్పోయి ఉన్న మహిళ పక్కన  పరాయి వ్యక్తిని పడుకోబెట్టింది. అనంతరం వారిద్దరితో అసభ్యంగా ఫోటోలు తీసింది. తెల్లారి మత్తు వీడిన యువతికి ఆ ఫోటోలు చూపించి బెదిరించడం మొదలుపెట్టింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకుంటే.. ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడం గమనార్హం.

ఆమె బెదిరింపులు తట్టుకోలేని యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో బాధితురాలు చెప్పింది నిజమని తేలడంతో... యువతి పిన్నిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు  చెప్పారు.