లవ్ మ్యారేజ్ చేసుకున్న మూడు నెలలకే.. వలంటీర్ ఆత్మహత్య..
కోరుకున్న వాడితోనే ప్రేమ వివాహం చేసుకుంది. ముచ్చటగా మూడు నెలలు కూడా గడవకముందే అర్థాంతరంగా తనువు చాలించింది. విజయనగరంలో ఓ వలంటీర్ విషాదగాథ ఇది. అయితే ఆమె ఆత్మహత్య వెనుక కారణాలు మాత్రం తెలియరాలేదు.
విజయనగరం : ప్రేమను పండించుకుని భవిష్యత్తుపై కోటి ఆశలతో ప్రియుడినే marriage చేసుకుంది ఓ యువతి. కానీ పెళ్లైన మూడు నెలలకే బుధవారం నాడు suicideకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి… మండలంలోని gajarayunivalasa గ్రామానికి చెందిన పాచిపెంట స్వాతి (25) బుధవారం కన్నవారి ఇంటి వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోగా.. గమనించిన Family members స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స మృతి చెందింది.
ఆమె సాలూరులో బ్యాంకులో మేనేజర్ గా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న భోగి చాణక్యను ప్రేమించి, పెద్దల్ని ఒప్పించి మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. స్వాతి వలంటీర్ గా పనిచేస్తుండడంతో భర్త అప్పుడప్పుడు అత్త వారిఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఇంతలో ఏమైందో కానీ ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ. నరేష్ కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుపై తాసిల్దార్ కె సుధాకర్ మెజిస్టీరియల్ దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా మృతురాలి తల్లిదండ్రులు, భర్త, బంధువులను ప్రశ్నించారు.
కుమార్తె ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని ఫిర్యాదులో తల్లి పేర్కొనడంతో పంచాయతీ పెద్దల సమక్షంలో ఆసుపత్రి దగ్గరే శవ పంచనామా చేసి.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. వలంటీర్ స్వాతి మృతితో తోటి వలంటీర్లు, గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.
కాగా, ఫిబ్రవరి 14న హైదరాబాద్ లో ఓ భర్త ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మందలించడంతో మనస్తాపంతో GHMC కాంట్రాక్టు ఉద్యోగి suicideకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం ఆల్వాల్ లో నివసించే అంజయ్య (32) జిహెచ్ఎంసి చెత్త తరలింపు వాహనం driverగా పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితం తండ్రి, తమ్ముడి వద్ద అప్పు తీసుకుని house కట్టుకున్నాడు. అయితే సకాలంలో ఆ debt చెల్లించకపోవడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం అంజయ్య తమ్ముడు.. వదిన లక్ష్మమ్మ తో గొడవ పడ్డాడు. తీవ్రంగా వాగ్వాదం జరిగింది. దీంతో సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు ఆమె జరిగిన గొడవ మొత్తం చెప్పింది.. ఇలా మాటలు పడడానికి, గొడవకు భర్తే కారణం అని కోప్పడింది. దీంతో మనస్థాపంతో అంజయ్య ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.
మరో ఘటనలో.. భీమ్లా నాయక్ సినిమాకు డబ్బులివ్వలేదని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. jagtial జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సినిమా టికెట్ కు డబ్బులు ఇవ్వలేదని ఓ స్కూల్ విద్యార్థి suicide చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నవదీప్ (11) అనే బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు.
Bhimla Nayak సినిమా కోసం తన మిత్రులు ముందుగానే tickets Bookచేసుకుంటున్నారని తనకి కూడా రూ.300 కావాలని తండ్రిని నవదీప్ అడిగాడు. అందుకు తండ్రి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన నవదీప్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.