కొడుకు కాలేజీకి వెళ్లలేదని ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  మండలంలోని ఆరె పంచాయతీ కన్నంకళత్తూరు గ్రామానికి చెందిన మెహన్, జ్యోతి  దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో మొదటి కుమారుడు శ్రీకాళహస్తీలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

Also Read కడపలో విషాదం:ఇద్దరు కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్య...

అయితే... తమ స్థాయికి మించి మరీ ఫీజులు కట్టి...మరీ చదవిస్తుంటే.. కొడుకు కాలేజీకి వెళ్లడం లేదని ఆమె బెంగ పెట్టుకుంది. ఈ విషయంలో ఈ నెల 25వ తేదీన కొడుకును మందలించింది. అయితే ఆమె మాటలను కొడుకు ఖాతరు  చేయలేదు. దీంతో కొడుకును బెదిరిద్దామనుకుని పురుగుల మందు తాగింది.

గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.