కడప: కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఒకే కుటంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహలతోనే ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. 

శ్రీనివాసపురం గ్రామానికి చెందిన బాలకొండయ్యతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు భావన, శోభనలు వ్యవసాయబావిలో శవాలుగా తేలారు. గురవారం నాడు సాయంత్రం నుండి ఈ ముగ్గురు కన్పించకుండాపోయారు. స్థానికులు వారి కోసం వెదికారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు.

ఇవాళ ఉదయం పొలానికి వెళ్తున్న స్థానికులు వ్యవసాయబావిలో మూడు మృతదేహలను గుర్తించారు. మృతదేహలను బాలకొండయ్యతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు భావన, శోభనవిగా గుర్తించారు.

Also read:ఏకాంత ఫోటోలు, వీడియోలతో వేధింపులు: మాజీ భర్తపై ఫిర్యాదు

గత ఏడాది క్రితమే బాలకొండయ్య భార్య బుజ్జమ్మ ఆత్మహత్య చేసుకొంది.  గురువారం నాడు ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ముగ్గురి ఆత్మహత్యకు కుటుంబ కలహలే కారణంగా గ్రామస్తులు చెబుతున్నారు.

ఏడాది వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం గ్రామంలో విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.