పెళ్లి తర్వాత కూడా వారి సంసారం సాఫీగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. దీంతో.. అవి తట్టుకోలేక సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది
వారిద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలంపాటు ప్రేమించుకున్న తర్వాత వారు... పెళ్లి పీటలు ఎక్కారు. పెళ్లి తర్వాత కూడా వారి సంసారం సాఫీగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. దీంతో.. అవి తట్టుకోలేక సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుత్తూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పుత్తూరు పట్టణానికి చెందిన బాలచంద్ర(30) అనే వ్యక్తి గుంటూరు నగరానికి చెందిన సౌజన్యతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. రెండేళ్ల పా టు ఫేస్‌బుక్ ద్వారా ప్రేమను పంచుకున్న వారు పెద్దలను కాదని ఏడాదిన్న క్రితం వివాహం చేసుకున్నారు.
ఇద్దరూ కలిసి స్థానిక మండపం వీధిలో కాపురం పెట్టారు. బాలచంద్ర పుత్తూరులో ని మాత్ర ఫార్మసీలో పనిచేసేవాడు. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సౌజన్య బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. గుంటూరులోని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. వారు పుత్తూరుకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు సేకరించి, కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
