అమరావతి సెక్రెటేరియట్ వద్ద అపస్మారక స్థితిలో యువతి

woman attempts suicide after parents opposing love marriage
Highlights

ప్రేమ పెళ్లికి తల్లితండ్రులు అంగీకరించలేదని ఆత్మహత్యా యత్నం?

 

 

అమరావతి, సచివాలయ ప్రధాన ద్వారం సమీపంలో అపస్మారక స్థితిలో  ఒక యువతి పడి ఉండటాన్ని పోలీసుల కనుగొన్నారు. ఆమె పేరు జి.వసుధగా గుర్తించారు.వసుధ స్వగ్రామం చిత్తూరు జిల్లా  మదనపల్లి...

సూసైడ్ చేసుకునేందుకు ట్యాబ్ లెట్స్  మింగి ఉండవచ్చు అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ,సూసైడ్ చేసుకుందుకు కారణమై ఉండవచ్చనుకుంటున్నారు. పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం, విజయనగరానికి చెందిన పి శ్రావణ్ కుమార్ , వసుధ  కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే,వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదన్న కారణంతో, ఆమె సూసైడ్  చేసుకోవాలనుకున్నది.

తనతో పాటు కొన్ని రకాల ట్యాబ్ లెట్స్ తీసుకొచ్చుకుంది. శ్రావణ్ కుమార్  ప్రస్తుతం వైజాగ్ లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎంప్లాయి గా పనిచేస్తున్నాడు. పోలీస్ సకాలంలో స్పందించారు. ఆమెను అంబులెన్స్ లో  హాస్పిటల్ కి తరలించారు.

loader