రెండేళ్ల పసిబిడ్డపై కన్నతల్లి రాక్షసంగా ప్రవర్తించింది. భర్తపై కోపంతో పసిబిడ్డను చిత్రహింసలు పెట్టింది. బిడ్డను కొడుతున్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి మరి భర్తకు పంపింది. తులసి అనే మహిళ దాదాపు 250 వీడియోలను భర్తకు  పంపింది.

ప్రియుడి మోజులో రెండేళ్ల కొడుకును హింసించి భర్తకు వీడియోలు పంపిన కసాయి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పుంగనూరు సోమల మండలం రాంపల్లిలో తులసిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడి కోరిక మేరకు కొడుకుని కొట్టి.. ఆ వీడియోలను ప్రియుడికి, భర్తకు పంపించింది తులసి. దెబ్బల ధాటికి రెండేళ్ల బాబు ప్రదీప్ పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.

ALso Read:చిన్నారిని కొడుతూ సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ: భర్తకు 250 వీడియోలు పంపిన కన్నతల్లి

బిడ్డను కొడుతున్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి మరి భర్తకు పంపింది. తులసి అనే మహిళ దాదాపు 250 వీడియోలను భర్తకు పంపింది. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా సత్యమంగళం మండలం మెట్టూరులో ఈ ఘటన జరిగింది. కొన్నాళ్లుగా భర్తతో తులసికి గొడవలు జరుగుతున్నాయి. ఆ కోపంతో కన్నబిడ్డను తీవ్రంగా కొట్టింది తులసి. ప్రస్తుతం రెండేళ్ల బాబు పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యకత్ం చేశారు. వెంటనే తులసిని అరెస్ట్ చేయాల్సిందిగా ఆయన పోలీస్ శాఖను ఆదేశించారు.