ఓ యువకుడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. అతనితో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగింది. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి తప్పించుకుతిరగడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని గుర్తించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె బాధవిని రక్షించాల్సిన పోలీసు ఆమెను కోరిక తీర్చాలని వేధించాడు. ఆఖరికి కానిస్టేబుల్ కూడా సదరు బాధితురాలిని, ఆమె తల్లిని లాడ్జికి వస్తావా అంటూ అసభ్యంగా మాట్లాడి వేధించడం గమనార్హం. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read అమ్మకి ఇద్దరితో అక్రమ సంబంధం.. ఇంట్లో బంధించి..

పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు శారదాకాలనీకి చెందిన యువతి వెంట మూడేళ్ల క్రితం డేవిడ్ అనే వ్యక్తి ప్రేమ పేరిట వెంటపడ్డాడు. అతని ప్రేమను సదరు యువతి కూడా అంగీకరించింది. మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకోమని కోరితే... కాదు పోమ్మన్నాడు. వెంటనే తల్లిని తీసుకొని డేవిడ్ పేరెంట్స్ దగ్గరకు బాధిత యువతి వెళ్లింది. వాళ్లు ముందు మేం పెళ్లిచేస్తామంటూ చెప్పి.. తర్వాత వాళ్లు కూడా చేతులు ఎత్తేసారు.

దీంతో మోసపోయానని గుర్తించిన సదరు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు సహాయం చేయాల్సిన పోలీసు తన వక్రబుద్ధి బయటపెట్టాడు. తన కోరిక తీరిస్తే న్యాయం చేస్తానంటూ సదరు యువతిని వేధించడం గమనార్హం. నేరుగా బాధిత యువతి ఇంటికి వెళ్లి.. తలుపు గడియ పెట్టి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీంతో యువతి ఎస్ఐ పై కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ సదరు యువతి, ఆమె తల్లిపట్ల నీచంగా ప్రవర్తించాడు. లాడ్జ్ కి వస్తే మీ సమస్య తీరుస్తానంటూ తల్లి, కూతురు ఇద్దరితో అనడం విశేషం. దీంతో ఖాకీ దుస్తుల్లో ఉన్న ఈ కామాంధులను శిక్షించాలని సదరు తల్లీకూతుళ్లు కోరుతున్నారు.