రెండు ఎన్నికల గెలుపుతో టిడిపి మిగిలిన ఎన్నికలను కుడా నిర్వహించే యోచనలో ఉందా? టిడిపిలో మొదలైన చర్చలు చూస్తే నిజమే అనిపిస్తోంది. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలోని 11 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయ్. ఎన్నికలు నిర్వహిస్తే గెలుస్తామో లేదో అన్న భయంతోనే టిడిపి ఇంతకాలం ఎన్నికలను వాయిదా వేస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే.

రెండు ఎన్నికల ఫలితాల గెలుపుతో టిడిపి మిగిలిన ఎన్నికలను కుడా నిర్వహించే యోచనలో ఉందా? టిడిపిలో మొదలైన చర్చలు చూస్తే నిజమే అనిపిస్తోంది. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలోని 11 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయ్. ఎన్నికలు నిర్వహిస్తే గెలుస్తామో లేదో అన్న భయంతోనే టిడిపి ఇంతకాలం ఎన్నికలను వాయిదా వేస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈనేపధ్యంలోనే నంద్యాల, కాకినాడ ఎన్నికలు జరిగాయి. రెండు చోట్ల కుడా టిడిపి ప్రమేయం లేకుండానే ఎన్నికలొచ్చాయి. అయితే, రెండు చోట్లా ఊహించని రీతిలో టిడిపి విజయం సాధించింది. మొన్నటి వరకు ప్రభుత్వంపై ప్రజా వ్యతరేకత ఉందని, కాపులు టిడిపికి వ్యతిరేకంగా ఓట్లేసి ఓడిస్తారనే భయం ఉండేది చంద్రబాబులో. అయితే, నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో సాధించిన గెలుపుతో ఆ భయం పూర్తిగా తొలగిపోయింది.

దాంతో పెండింగ్ లో ఉన్న మిగిలిన 10 కార్పొరేషన్ ఎన్నికలు కుడా నిర్వహించేస్తే ఎలాగుంటుందన్న చర్చ టిడిపి నేతల్లో మొదలైందట. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం కార్పొరేషన్ తో పాటు శ్రీకాకుళం, నెల్లిమర్ల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాలి. అదే విధంగా కోస్తాలో గుంటూరు, ఒంగోలు కార్పొరేషన్లతో పాటు ఓ మున్సిపాలిటిలో ఎన్నికలు పెండింగ్.

ఇక రాయలసీమకు వచ్చేసరికి తిరుపతి, కర్నూలు కార్పొరేషన్లకు కాకుండా మరో రెండు మున్పిపాలిటీలకు ఎన్నికలు జరగాలి. వీటిని కుడా నిర్వహించేస్తే మొత్తం రాష్ట్రంలోని ప్రజల మద్దతు సాధించినట్లవుతుందని పలువురు నేతలు చంద్రబాబుతో చెబుతున్నారట. ఎటుతిరిగి మరో రెండు మాసాల్లో విశాఖ కార్పొరేషన్ ఎన్నిక జరపక తప్పదేమో. ఎందుకంటే, ఇక్కడ కూడా కోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహణ ప్రక్రియను అధికారులు స్పీడ్ చేసారు. పనిలో పనిగా మిగిలిన ఎన్నికలు కుడా నిర్వహించేస్తే బాగుంటుందని నేతలు సూచిస్తున్నారు. మరి, చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి?