ప‌వ‌న్ పై వ్య‌క్తిగ‌త‌ విమ‌ర్శ‌లు చేయ‌డం ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు అనుకూలిస్తుందా? లేదా ప్లాన్ బెడిసికొడుతుందా?

Amaravati: రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అన్ని రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టినుంచే ముమ్మ‌రంగా ప్ర‌చారం మొద‌ల‌పెట్టాయి. ఈ విష‌యంలో అధికార పార్టీ త‌మ ముందున్న అన్ని అంశాల‌ను ఉప‌యోగించుకుంటుంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీ అధినేత అరెస్టు, ఈ పార్టీ ఇత‌ర నేత‌ల‌పై అవినీతి కేసులు, ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డం అధికార పార్టీకి కాస్త అనుకూలించే విష‌యాలుగా మారాయి. ఇది క్షేత్ర‌స్థాయిలో టీడీపీ శ్రేణుల్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితిని ఏర్ప‌ర్చింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం ముందున్న జ‌న‌సేన‌ను టార్గెట్ చేసిన వైసీపీ, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హా ఆ పార్టీకి చెందిన నాయ‌కులు ప‌వ‌న్ పై విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నారు. 

Will personal criticism of Pawan favour Jagan in the coming elections?  Or will the plan go awry?  RMA

YS Jagan Mohan Reddy-Pawan Kalyan: రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అన్ని రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టినుంచే ముమ్మ‌రంగా ప్ర‌చారం మొద‌ల‌పెట్టాయి. ఈ విష‌యంలో అధికార పార్టీ త‌మ ముందున్న అన్ని అంశాల‌ను ఉప‌యోగించుకుంటుంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీ అధినేత అరెస్టు, ఈ పార్టీ ఇత‌ర నేత‌ల‌పై అవినీతి కేసులు, ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డం అధికార పార్టీకి కాస్త అనుకూలించే విష‌యాలుగా మారాయి. ఇది క్షేత్ర‌స్థాయిలో టీడీపీ శ్రేణుల్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితిని ఏర్ప‌ర్చింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం ముందున్న జ‌న‌సేన‌ను టార్గెట్ చేసిన వైసీపీ, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హా ఆ పార్టీకి చెందిన నాయ‌కులు ప‌వ‌న్ పై విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నారు. విమ‌ర్శ‌లు మ‌రింత ప‌దును పెడుతూ వ్య‌క్తి విష‌యాల‌ను లాగుతూ రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే,  ప‌వ‌న్ పై అధ‌కార పార్టీ నేత‌లు ఇలా విమ‌ర్శ‌లు చేయ‌డం ఆ పార్టీకి అనుకూలిస్తుందా?  లేదా? అనే అంశంపై చ‌ర్చ న‌డుస్తోంది.

దీనికి సంబంధించి ప‌లు రాజ‌కీయ విశ్లేష‌కులు, సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు భిన్న కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఒక కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ తదితరులను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు, తీవ్ర ఆరోప‌ణ‌లు త‌న‌ ప్రసంగంలో ఉంచారు. ఈ ప్రసంగం జగన్ మద్దతుదారులకు, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఆసక్తిని కలిగించింది. ఇదే స‌మ‌యంలో ఇత‌ర పార్టీల నుంచి జ‌గ‌న్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మవుతోంది. దీనిపై సోషల్ మీడియా రియాక్షన్స్ ఇలా ఉన్నాయి.. ఒక నెటిజ‌న్ త‌న సోషల్ మీడియా పోస్ట్ లో 'జగన్ తన ప్రసంగంతో ఫుల్ ఎంటర్ టైన్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు జగన్ అభిమానులను, ఒక వర్గాన్ని చికాకు పెడుతున్న మాట వాస్తవమే. అయితే, కొన్ని వ్యాఖ్య‌లు పవన్ చెప్పదల్చుకోని లైన్. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పై జగన్ మరింత అసహ్యకరమైన పంక్తులను పక్కా కౌంటర్ గా ఉపయోగించి ఉండవచ్చు. అయినా నేటి ప్రసంగంలో జగన్ కు పవన్ పై కోపం లేదనీ, ఆయనపై జాలి చూపడం, తన వివాహాలు, చంద్రబాబు పట్ల విధేయత లేకపోవడం వంటి విషయాలపై సరదాగా ప్రకటనలు చేయడం గమనించానని పేర్కొన్నారు.

దీనికి భిన్నంగా మరో నెటిజన్ 'జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యల్లో కొత్తదనం ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ జీవితంలో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ భార్యలు ఉన్న విషయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం జగన్ టీ కప్పు కాకూడదు. బేసిక్ గా పవన్ కళ్యాణ్ కు ఏపీ పాలిటిక్స్ లో పెద్దగా ప్రాధాన్యత లేదు. ఏదేమైనా ఆయనను ఎదుర్కోవడానికి పేర్ని నాని, అంబటి రాంబాబు, బియ్యపు మధుసూదన్, కొడాలి నాని వంటి వారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేందుకు జగన్ వెనుకాడాల్సిన అవసరం లేద'న్నారు.  మ‌రో  నెటిజ‌న్.. 'ఎన్నికల సీజన్ రాబోతోంది. జగన్ మోహన్ రెడ్డి ఈ మితిమీరిన ప్రసంగాలు అవసరం లేదు. ఇలాంటి దాడులపై మౌనం పాటించాలని, ఆరోగ్య సురక్ష వంటి అంశాలపై మాత్రమే మాట్లాడాలన్నారు. కౌంటర్లు ఇవ్వడానికి ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. వ్యక్తిగత కౌంటర్లు ఇవ్వడంలో సీబీఎన్, లోకేశ్, పవన్ లా జగన్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోకూడదు' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

'చంద్రబాబును జగన్ విమర్శించాలి తప్ప మరెవరినీ విమర్శించకూడదన్నారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించడం అంటే ఆయనకు అనవసరమైన ప్రాధాన్యత, శ్రద్ధ ఇవ్వడం తప్ప మరొకటి కాదు' అని మరొకరు వ్యాఖ్యానించారు. 'జగన్ ప్రసంగంలో నాకు బాగా నచ్చిన విషయం పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం కాదు, చంద్రబాబు కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో ఎవరూ ఏపీలో లేరని, అందరూ తెలంగాణలోనే ఉన్నారని ఆయన చెప్పినప్పుడు' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మొత్తమ్మీద ఇటీవ‌లి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగానికి ఆయన అభిమానుల నుంచి కూడా మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే, వ్య‌క్తిగ‌త విష‌యాలు కాకుండా విమ‌ర్శ‌లు రాజ‌కీయాల వ‌ర‌కే ప‌రిమితం చేస్తూ పాల‌కాలం నాయకుల వార‌స‌త్వాన్ని కొన‌సాగించాల‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios