చంద్రబాబునాయుడు రెండు రోజులుగా పార్టీ నేతలకు మేనేజ్ మెంట్ పాఠాలు బాగానే బోధించారు. మేనేజ్ మెంట్ పాఠాలంటే ఇదేదో వ్యాపారాలకు సంబంధించింది అనుకునేరు. ఫక్తు రాజకీయాలకు సంబంధించింది. ఇంతకీ చంద్రబాబు చెప్పిన మేనేజ్ మెంట్ సూత్రాలేంటంటే, పబ్లిక్ మేనేజ్ మెంట్, పొలిటికల్ మేనేజ్ మెంట్, పోల్ మేనేజ్ మెంట్. ఈ మూడింటిని అనుసంధానం చేసుకుంటే, తూచా పాటిస్తే వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లూ టిడిపికే దక్కుతాయట.
చంద్రబాబునాయుడు రెండు రోజులుగా పార్టీ నేతలకు మేనేజ్ మెంట్ పాఠాలు బాగానే బోధించారు. మేనేజ్ మెంట్ పాఠాలంటే ఇదేదో వ్యాపారాలకు సంబంధించింది అనుకునేరు. ఫక్తు రాజకీయాలకు సంబంధించింది. ఇంతకీ చంద్రబాబు చెప్పిన మేనేజ్ మెంట్ సూత్రాలేంటంటే, పబ్లిక్ మేనేజ్ మెంట్, పొలిటికల్ మేనేజ్ మెంట్, పోల్ మేనేజ్ మెంట్. ఈ మూడింటిని అనుసంధానం చేసుకుంటే, తూచా పాటిస్తే వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లూ టిడిపికే దక్కుతాయట. సరే, చంద్రబాబు మాటలను అత్యాసగా అనుకునే వారు కూడా లేకపోలేదులేండి.
ఇంతకీ మూడు సూత్రాలను ఎలా పాటించాలి? ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి స్ధాయిలను పెంచుకోవటం ద్వారా పట్లిక్ మేనేజ్ మెంట్ లో సక్సెస్ అవ్వచ్చునట. ఎలాగంటే, సంక్షేమ పథకాల లబ్దిదారులను పెంచుకుంటే వారంతా టిడిపికే ఓట్లేస్తారట. ఇక, లబ్దిదారులను అందరినీ పార్టీకి అనుకూలంగా మలుచుకోవటం పొలిటికల్ మేనేజ్ మెంటట. ఎన్నికలొచ్చినపుడు లబ్దిదారులందరినీ టిడిపికి ఓట్లేసేట్లు చూసుకోవటం పోల్ మేనేజ్ మెంటట. ఈ మూడు సూత్రాలను సరిగ్గా అమలు చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు రాబట్టుకోవచ్చన్నది చంద్రబాబు అంచనా. దాంతోనే టిడిపికి శాశ్వత అధికారం సాధ్యమట.
పై మూడు సూత్రాలు ఆచరణలోకి రావాలంటే ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు నేతలందరూ 24 గంటలూ జనాల్లోనే గడపాలని చంద్రబాబు చెప్పారు. ప్రతీ 100 మంది ఓటర్లకు ఒకరిని బాధ్యులుగా నియమించాలన్నారు. సంక్షేమ పథకాలు వారికందేలా చూడాల్సిన బాధ్యత వారిదేనట. అందుకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని 20 క్లస్టర్లుగా విభజిస్తున్నారు. అంటే మొత్తం మీద 3500 క్లస్టర్ ఇన్చార్జిలుంటారన్నమాట. సరే, వినటానికి ఇవన్నీ బాగనే ఉన్నాయి. కానీ, జనాలేమనుకుంటున్నారో, ప్రజాప్రతినిధులపై జనాల్లో ఉన్న అసంతృప్తిని మేనేజ్ మెంట్ చిట్కాలు ఏ మేరకు రక్షిస్తాయో చూడాలి.
