Asianet News TeluguAsianet News Telugu

మైదుకూరు నుండి డీ.ఎల్. రవీంద్రా రెడ్డి: టీడీపీ టిక్కెట్టు దక్కేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైదుకూరు నుండి  మరోసారి బరిలోకి దిగేందుకు  మాజీ మంత్రి డీ.ఎల్. రవీంద్రా రెడ్డి రంగం సిద్దం చేసుకుంటున్నారు.  
 

  Will D.L. Ravivandra Reddy get TDP ticket from mydukur assembly segment?
Author
First Published Jan 1, 2024, 10:25 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి  మరోసారి బరిలోకి దిగాలని  డీ.ఎల్. రవీంద్రా రెడ్డి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ దఫా డీ.ఎల్. రవీంద్రా రెడ్డి తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతుంది.  అయితే ఈ అసెంబ్లీ స్థానం నుండి  పుట్టా సుధాకర్ యాదవ్  కూడ తెలుగు దేశం పార్టీ టిక్కెట్టు కోసం పట్టుబడుతున్నారు. గతంలో రెండు దఫాలు ఇదే స్థానం నుండి పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అయితే ఈ దఫా సుధాకర్ యాదవ్  పోటీ చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. 

2014 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి డీ.ఎల్. రవీంద్రా రెడ్డి చంద్రబాబును కలిశారు. టీడీపీలో చేరాలని భావించారు. అయితే మైదుకూరు అసెంబ్లీ స్థానం  నుండి పుట్టా సుధాకర్ యాదవ్ ను  టీడీపీ అభ్యర్ధిగా నిర్ణయించింది. అయితే  కడప పార్లమెంట్ స్థానంలో పోటీ చేయాలని  అప్పట్లో తెలుగు దేశం పార్టీ ప్రతిపాదించింది. అయితే చివరి నిమిషంలో  డీ.ఎల్. రవీంద్రా రెడ్డి రావడంతో  టిక్కెట్ల కేటాయింపులో ఇబ్బంది రావడంతో  రవీంద్రారెడ్డికి టిక్కెట్టు ఇవ్వడం సాధ్యం కాలేదని అప్పట్లో పార్టీ నేతలు చెప్పారు. దీంతో  తెలుగు దేశం పార్టీ టిక్కెట్టుపై  పోటీ చేయడం  డీ.ఎల్. రవీంద్రారెడ్డికి సాధ్యం కాలేదు.

2019 ఎన్నికల సమయంలో  వైఎస్ఆర్‌సీపీలో మాజీ మంత్రి డీ.ఎల్. రవీంద్రా రెడ్డి చేరారు.  అయితే  డీ.ఎల్. రవీంద్రా రెడ్డి  ప్రస్తుతం వైఎస్ఆర్‌పీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలుగు దేశం పార్టీ వైపు డీ.ఎల్. రవీంద్రా రెడ్డి చూస్తున్నారు. మైదుకూరు నుండి  పోటీ చేయాలని డీ.ఎల్. రవీంద్రారెడ్డి భావిస్తున్నారు. రెండేళ్ల క్రితమే  మైదుకూరు నుండి పోటీ చేస్తానని  ప్రకటించారు. అయితే  తెలుగు దేశం పార్టీ నుండి పోటీ చేయాలని డీ.ఎల్. రవీంద్రా రెడ్డి భావిస్తున్నారు. అయితే  పుట్టా సుధాకర్ యాదవ్ కు కాకుండా  డీ.ఎల్. రవీంద్రా రెడ్డికి  టిక్కెట్టు కేటాయిస్తుందా అనే చర్చ సాగుతుంది. 

also read:ఆపరేషన్ కాపు: ముద్రగడ, వంగవీటి రాధాలకు జగన్ గాలం

ఈ దఫా ఎన్నికలను తెలుగు దేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది.  ఈ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేనలు మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నాయి. గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు.ఇప్పటికే  90 అసెంబ్లీ స్థానాల్లో  అభ్యర్థులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

also read:పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..

మైదుకూరు నుండి గత రెండు దఫాలు తెలుగు దేశం పార్టీ  నుండి పోటీ చేసి ఓడిపోయిన పుట్టా సుధాకర్ యాదవ్  మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి సమీప బంధువు.  బీసీ సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్  యాదవ్ ను పక్కన పెట్టి  డీ.ఎల్. రవీంద్రా రెడ్డికి టిక్కెట్టు కేటాయిస్తారా అనే చర్చ కూడ లేకపోలేదు.  మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి ఆరు దఫాలు  డీ.ఎల్. రవీంద్రా రెడ్డి  ప్రాతినిథ్యం వహించారు.  టీడీపీ టిక్కెట్టు  ఇస్తానంటే  డీ.ఎల్. రవీంద్రా రెడ్డి  పసుపు పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతుంది. 

also read:ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి మరోసారి పోటీకి  మాజీ మంత్రి డీ.ఎల్. రవీంద్రా రెడ్డి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తెలుగు దేశం పార్టీ టిక్కెట్టు కోసం  డీ.ఎల్. రవీంద్రా రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో రెండు దఫా ఇదే స్థానం నుండి పుట్టా సుధాకర్ యాదవ్  పోటీ చేశారు. పుట్టా సుధాకర్ యాదవ్ ను కాదని  డీ.ఎల్. రవీంద్రా రెడ్డికి  టీడీపీ టిక్కెట్టు కేటాయిస్తుందా అనే చర్చ  కూడ లేకపోలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios