తన భర్త పరాయి యువతులతో ఎలా ప్రవర్తిసాడో..? తెలుసుకునేందుకు.. అతనితో కవ్వింపుగా ఫోన్‌లో మాట్లాడాలని యువతిని రామలక్ష్మి కోరింది. అలా.. కొద్దిరోజులు మాట్లాడిన తర్వాత.. రామ్‌జీ క్రమంగా యువతిని ప్రేమపేరుతో వంచించాడు.

ఓ మహిళకు ఎప్పటి నుంచో తన భర్తపై అనుమానం ఉంది. ఆ అనుమానం తీర్చుకునేందుకు మరో యువతిని ఎరగా వేసింది. చివరకు ఆ యువతే తనకు సవతిలా మారి కూర్చుంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా గాజువాకలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..విశాఖపట్నం జిల్లాలోని గాజువాక‌లో ఓ యువతి (20) తన తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. ఏడాది క్రితం యువతి ఉంటున్న పక్కింటిలోకి రామ్‌జీ, రామలక్ష్మి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి అద్దెకు దిగారు. 

కొత్త ఇంటిలోకి వచ్చిన తర్వాత.. తన భర్త పరాయి యువతులతో ఎలా ప్రవర్తిసాడో..? తెలుసుకునేందుకు.. అతనితో కవ్వింపుగా ఫోన్‌లో మాట్లాడాలని యువతిని రామలక్ష్మి కోరింది. అలా.. కొద్దిరోజులు మాట్లాడిన తర్వాత.. రామ్‌జీ క్రమంగా యువతిని ప్రేమపేరుతో వంచించాడు. దీనికి స్థానికంగా ఉన్న రామ్‌జీ మిత్రుడు కూడా సహకరించడంతో.. యువతిని తిరుపతికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. దీంతో.. కంగుతిన్న భార్య.. అతనితో గొడవపడగా.. ఖమ్మంలో యువతితో కలిసి కొత్త కాపురం పెట్టాడు. 

ఇటీవల రామలక్ష్మి తన భర్తపై పోలీసులుకి ఫిర్యాదు చేయడంతో ఈ నెల 14న ఖమ్మం వెళ్లిన పోలీసులు.. రామ్‌జీ, కొత్తగా పెళ్లి చేసుకున్న యువతిని గాజువాకకి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్‌లోనే కౌన్సెలింగ్ ఇచ్చి.. భర్తను రామలక్ష్మికి అప్పగించారు. అయితే.. ఈ విషయంలో తనకు న్యాయం జరగలేదని.. ప్రేమ, పెళ్లి పేరిట రామ్‌జీ, తనని మోసం చేశాడంటూ.. తాజాగా యువతి పోలీసులని ఆశ్రయించింది.