ప్రియుడితో కలసి భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది..
సెల్ ఫోన్ పరిచయం మరో భర్త ప్రాణం మీదకు తెచ్చింది. సెల్ ఫోన్లో అపరిచిత వ్యక్తితో పరిచయం పెంచుకున్న భార్య దాన్ని ప్రేమగా మార్చుకుని చివరికి భర్తను చంపేందుకు ప్రయత్నించింది. సీలేరుకు చెందిన మహేశ్వరి తన భర్త అప్పల్రాజును ప్రియుడు శ్రీనివాసరావుతో కలిసి చంపేందుకు కుట్ర పన్నింది. మహేశ్వరికి రెండు నెలల క్రితమే ప్రియుడితో పరిచయమైంది. భర్త వల్ల తనకు సంతోషం లేదని, తనను వేధిస్తుంటాడని చెప్పింది. దీంతో ప్రియుడు శ్రీనివాసరావు ఓ పధకం ప్రకారం అప్పల్రాజును చంపేద్దామని ఆమెకు సలహా ఇవ్వడంతో అందుకు మహేశ్వరి అంగీకరించింది. దీంతో రాత్రి 12 గంటల సమయంలో పక్కింటి గోడ దూకి అప్పల్రాజు మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో అప్పల్రాజు ప్రతిఘటించడంతో శ్రీనివాసరావు అక్కడి నుంచి పారిపోయాడు. భర్తను చంపేందుకు వచ్చింది ప్రియుడే అని తెలిసినా మహేశ్వరి దొంగలంటూ కేకలు వేస్తూ నటించింది. పోలీసులు కేసు విచారణకు రావడంతో అసలు నిజం బైటపడింది. తాత్కాలికమైన సుఖాల కోసం భర్తలను భార్యలు, భార్యలను భర్తలు చంపుకుంటున్న ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇందుకు సెల్ ఫోన్ పరిచయాలు కూడా కారణమవుతున్నాయి.
