కాకినాడ:తూర్పు గోదావరి జిల్లా కరప మండంలో ఇటీవల జరిగిన నవ వరుడి హత్య కేసులో భార్యే నిందితురాలుగా తేలింది. ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేయించింది.

తూర్పు గోదావరి జిల్లా కరపకు చెందిన పేకేటి సూర్యనారాయణ మండపేటలోని శ్రీ వికాస జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.ఈ నెల 15వ తేదీన కరప శివారు గ్రామానికి చెందిన పేవకాయలపాలెం గ్రామానికి చెందిన మద్దూరి వెంకటేశ్వరరావు కూతురు నాగలక్ష్మిని సూర్యనారాయణ వివాహం చేసుకొన్నాడు.

నాగలక్ష్మికి రెండేళ్ల ముందు నుండి రాధాకృష్ణ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నెల 21వ తేదీన సూర్యనారాయణ అత్తింటి నుండి కరపకు వచ్చాడు.  అదే రోజు సాయంత్రం తిరిగి వేపకాయపాలెం వెళ్లాడు. అప్పటి నుండి అతను కన్పించకుండాపోయాడు.సూర్యనారాయణ కోసం గాలించినా ఆచూకీ దక్కలేదు.

నిందితుడు రాధాకృష్ణ సూచనల మేరకు ఈ నెల 22వ తేదీన ఉదయం పెనుగుదురు- పాతర్లగడ్డ  రహదారిలో  పంటపొలంలో సూర్యనారాయణ మృతదేహం లభించింది. సూర్యనారాయణను హత్య చేసి తలపై గడ్డి కప్పి ఉంచారు. 

సూర్యనారాయణను చంపాలని ప్రియుడు రాధాకృష్ణను నాగలక్ష్మి కోరింది. దీంతో రాధాకృష్ణ సూర్యనారాయణ హత్య చేశాడు.  నాగలక్ష్మికి తనకు మధ్య వివాహేతర సంబంధానికి అడ్డు లేకుండా ఉండేందుకు గాను  సూర్యనారాయణను హత్య చేశారు.రాధాకృష్ణతో పాటు ప్రియురాలు నాగలక్ష్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.