వివాహేతర సంబంధం: ఇన్సూరెన్స్ డబ్బులకు ప్రియుడితో కలిసి భర్త మర్డర్

Wife Kills Husband To Claim Insurance Amount
Highlights

ఇన్సూరెన్స్ కోసం ప్రియుడితో భర్త హత్య


కర్నూల్:ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని చోలవీడులో  ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేసిన ఉందంతాన్ని పోలీసులు చేధించారు. ఈ కేసులో  నిందితులను పోలీసులు
అరెస్ట్ చేశారు.


ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని చోలవీడుకు చెందిన శ్రీనివాసులు హత్య కేసు మిస్టరీని కర్నూల్ జిల్లా ఓర్వకల్లు పోలీసులు చేధించారు. ఈ ఏడాది జనవరి 25వ తేదిన ఓర్వకల్లు
సమీపంలోని బేతంచర్ల రహదారిలో శ్రీనివాసులును లారీ కింద తోసి హత్య చేసి నిందితులు పారిపోయారు.

తొలుత పోలీసులు దీన్ని రోడ్డు ప్రమాదం కేసుగా గుర్తించారు. కానీ, ఈ కేసు విషయమై  విచారణ చేస్తున్న సమయంలో శ్రీనివాసులు హత్య కేసుగా గుర్తించారు. దీంతో కేసును హత్య కేసుగా
మార్చారు.

గిద్దలూరుకు చెందిన అదే జిల్లా కృష్ణంశెట్టిపల్లెకు చెందిన రమాదేవితో 23 ఏళ్ళక్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చోలవీడు గ్రామానికి చెందిన మధుతో కలిసి
రమాదేవి సోదరుడు రమేష్ హైద్రాబాద్ లో ఆయిల్ వ్యాపారం నిర్వహించేవాడు.  ఈ క్రమంలో రమాదేవితో మధు వివాహేతర సంబంధం  ఏర్పడింది.ఈ విషయం రమాదేవి భర్త శ్రీనివాసులుకు
తెలిసింది. అయితే శ్రీనివాసులు ఉంటే తమ ప్రాణాలకు ముప్పుగా భావించారు. 


శ్రీనివాసులును హత్య చేయాలని ప్లాన్ చేశారు. అయితే అంతకుముందే శ్రీనివాసులు పేరు మీద రూ. 2 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకొన్నారు. ఈ పాలసీల కోసం ఆయన రుణాలు కూడ తీసుకొన్నారు. ప్రమాదంలో శ్రీనివాసులు మరణిస్తేనే ఇన్సూరెన్స్ డబ్బులు క్లైయిమ్ చేసుకోవచ్చు. 


 
రమాదేవి, రమేష్ మరికొందరు పుణ్యక్షేత్రాల సందర్శన కోసం బయలుదేరారు. ఈ ఏడాది జనవరి 23వ తేదిన రాత్రి వారంతా మహానందికి చేరుకొన్నారు. మరునాడు కర్నూల్ కు వెళ్ళారు.

అక్కడే రాత్రి బస చేశారు. మరునాడు ఉదయం యాగంటికి బయలుదేరారు. ఓర్వకల్లు శివారులోని బేతంచర్ల రోడ్డులో చెన్నంశెట్టిపల్లె వద్ద లారీ కింద శ్రీనివాసులును తోశారు. లారీ కింద పడిః శ్రీనివాసులు మరణించినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశారు.


శ్రీనివాసులు పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు స్కోడా కారును పోలీసులు సీజ్ చేశారు. లారీ కింద శ్రీనివాసులును తోసేసిన తర్వాత రమాదేవి, రమేష్ తప్పించుకొన్నారు.


అయితే రమాదేవి, రమేష్ హైద్రాబాద్ నుండి కర్నూల్ కు వస్తున్నట్టు సమాచారాన్ని సేకరించిన పోలీసులు సుంకేసుల వద్ద వారిని సోమవారం నాడు అరెస్ట్ చేశారు.రమాదేవి ప్రియుడు మధుతో పాటు మరికొందరిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తునట్టు డీఎస్పీ మధుసూధన్ రావు చెప్పారు.

loader