ప్రేమించి పెళ్లి చేసుకుని, మూడు నెలలు కాకుండానే భర్తను దారుణంగా చంపింది భార్య.  వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక గ్రామానికి చెందిన గెడ్డం రాజు, అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మీని బంధువుల పెళ్లిలో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.

వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే రాజుకు మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో రాజు తల్లి సోమవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లేందుకు వేరే ఊరు వెళ్లింది. ఇంట్లో రాజు, సుబ్బలక్ష్మీ మాత్రమే ఉన్నారు. తెల్లవారిన తరువాత వరండాలో పడుకున్న రాజు తండ్రిని సుబ్బలక్ష్మీ లేపింది.

తన భర్త ఎంతలేపినా లేవడం లేని మామతో చెప్పింది. అతను వెళ్లి కుమారుని నిద్రలేపేందుకు ప్రయత్నించాడు. ఎంతకీ లేవకపోవడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా చనిపోయాడాని నిర్థారించారు. గ్రామస్తులు దీనిని హత్యగా భావించడంతో రాజు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుబ్బలక్ష్మీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజును భార్య సుబ్బలక్ష్మీ హత్య చేసిందా లేక ఎవరైనా వచ్చి అంతం చేసి వెళ్లారా అన్నది తెలియాల్సి ఉంది. భార్యాభర్తలు పడుకున్న గదికి ఒకవైపు కిటికీకి ఫ్రేమ్ లేదని, అందువల్ల వరండాలో పడుకున్న రాజు తండ్రికి అనుమానం రాలేదని భావిస్తున్నారు.