ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తిని భార్య అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఇరువురి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా భార్య భర్తను సినీ ఫక్కీలో హత్య చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా టి. నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో ఈ సంఘటన జరిగింది. మంచానికి చేతులూ కాళ్లూ కట్టేసి, మెడకు మరో తాడును బిగించి, నడుమును మంచానికి చీరతో కట్టేసి బ్లేడుతో మర్మాంగాన్ని కోసి భర్తను భార్య చంపేసింది. 

హత్య చేసిన తర్వాత బంధువులకు సమాచారం ఇచ్చి ఆమె పారిపోయింది. చివరకు పోలీసుల ఎదుట లొంగిపోియంది. చింతలపూడి సీఐ పి. రాజేష్, ట్రైనీ డిఎస్పీ హర్షిత సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశఆరు. మక్కినవారి గూడంలోని ఊరగుంట కొత్తపేటకు చెందిన కఠారి అప్పారావు (35)కు తెలంగాణలోని దమ్మపేట గ్రామానికి చెందిన లక్ష్మితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. 

Also Read: కొడుకులతో కలిసి భర్తను చంపిన భార్య

ఐదేళ్ల క్రితం కఠారి అప్పారావు మద్యానికి బానిస కావడంతో పాటు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దాంతో దంపతుల మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ వస్తున్నాడు. ఇరువురి గ్రామపెద్దలు పలుమార్లు పంచాయతీ పెట్టి సర్ది చెప్పారు. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. 

బుధవారంనాడు అప్పారులు మట్టి తోలడానికి వెళ్లాడు. లక్ష్మి తన కూతురును పుట్టింటికి పంపించింది. ఆ తర్వాత బుధవారం రాత్రి భర్తను చంపింది. మద్యం సేవించి ఉన్న అప్పారావును భార్య నవ్వారు మంచానికి రెండు వైపులా తాళ్లతో చేతులూ కాళ్లూ కట్టేసింది. నడుముకు, మెడకు తాడు బిగించింది. బ్లేడుతో మర్మాంగాలు కోసి హత్య చేసి ఇంటికి తాళం వేసి పారిపోయింది. 

Also Read: ప్రియునితో అఫైర్, భర్తను చంపిన భార్య: పోలీసాఫీసర్ తోనూ రాసలీలలు

గురువారం ఉదయం అప్పారావు అన్న కఠారి నాగేశ్వర రావుకు లక్ష్మి ఫోన్ చేసి మీ అన్న ఇంట్లో ఉన్నాడు, చూసుకో అని చెప్పింది. దాంతో తలుపులు తెరిచి చూడగా, అప్పారావు శవమై కనిపించాడు. ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని చింతలపూడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

మృతుడి సోదరుడు నాగేశ్వర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే, నిందితురాలు లక్ష్మి బంధువుల ద్వారా వెళ్లి గురువారం సాయంత్రం టి. నరసాపురం పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.