ఆళ్లగడ్డ: ప్రియుడితో రాసలీలల్లో మునిగితేలుతున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డలో సోమవారం నాడు జరిగింది.

ఆళ్లగడ్డ పట్టణంలోని రామలక్ష్మీ కొట్టాల రెండో వీధిలో వాసం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతను ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఓ సంఘం హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన చెప్పుకొంటాడు.

తనకు పలువురితో పరిచయం ఉందని చెప్పి ఆటోడ్రైవర్ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకొన్నాడు.ఈ విషయమై భర్తకు అనుమానం వచ్చి హక్కుల సంఘం నేతను తమ ఇంటికి రావొద్దని హెచ్చరించాడు. అయినా కూడ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.

ఆటో డ్రైవర్  ఇంట్లో లేని సమయంలో హక్కుల సంఘం నేత వచ్చి అతని భార్యతో రాసలీలల్లో మునిగాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతనికి సమాచారం ఇచ్చారు.

వీరిద్దరిని లోపలే ఉంచి బయటి నుండి తాళం వేశారు.  పోలీసులు వచ్చిన తర్వాత తలుపులు తీసి లోపల ఉన్న వారిద్దరిని అదుపులోకి తీసుకొన్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.