కృష్ణాజిల్లా, తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామంలో భార్యపై అనుమానంతో హత్య చేశాడో భర్త. ఈ కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. 

తిరువూరు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ యం. శేఖర్ బాబులతో కలిసి కేసు వివరాలను నూజివీడు డిఎస్పీ బి. శ్రీనివాసులు వెల్లడించారు.  భార్యపై అనుమానంతో భర్తే ఈ హత్య చేసినట్లు నిర్థారించారు. 

"

భార్యను హత్య చేసిన నిందితుడ్ని తిరువూరు బైపాస్ రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి వద్ద అరెస్ట్ చేశామని, అతని వద్దనుంచి హత్యాయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

అనుమానంతో భార్యను రోకలి బండతో బాది దారుణంగా హత్య చేశాడని వెల్లడించారు. అతని వద్దనుండి రోకలిబండను స్వాధీనం చేసుకుని, అతన్ని రిమాండ్ కు తరలిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు.