భర్తతో వివాహేతర సంబంధం.. పారిశుద్ధ్య కార్మికురాలిని గొంతుకోసి చంపిన భార్య..
వారు ఉంటున్న ఇంటి పరిసరాల్లో ఉండే ఒరుసు ఆదినారాయణతో సత్యకు ఏడాదిగా పరిచయం ఏర్పడి... అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త పలుమార్లు వారించినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. విసుగు చెందిన భర్త ఇటీవల కుటుంబానికి దూరంగా భవానిపురంలో ఒంటరిగా ఉంటున్నాడు.
కృష్ణలంక : తన భర్తతో extramarital affair పెట్టుకున్న మహిళను ఆ వ్యక్తి భార్య murder చేసిన ఉదంతం విజయవాడలోని రాణి గారి తోట లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు రౌతు సత్య (36) భర్త, కుమార్తెతో కలిసి రాణి గారి తోట 18 వ డివిజన్ కరెంట్ ఆఫీస్ పరిసరాల్లో నివాసం ఉంటోంది.
భర్త భవానిపురంలో ముఠా కార్మికుడిగా, సత్య ఏలూరు రోడ్డులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఉంటున్న ఇంటి పరిసరాల్లో ఉండే ఒరుసు ఆదినారాయణతో సత్యకు ఏడాదిగా పరిచయం ఏర్పడి... అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త పలుమార్లు వారించినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. విసుగు చెందిన భర్త ఇటీవల కుటుంబానికి దూరంగా భవానిపురంలో ఒంటరిగా ఉంటున్నాడు.
ఇలా ఉండగా వివాహేతర సంబంధం విషయంపై ఆదినారాయణ wife మల్లేశ్వరికి, సత్యకు మధ్య తరచూ conflicts జరుగుతూ ఉండేవి. దీంతో సుమారు 20 రోజుల కిందట సత్య ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి లక్కీబార్ సందులోని ఇంట్లో అద్దెకు దిగింది. adinarayana రోజు వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఎనిమిదో తరగతి చదువుతున్న సత్య కుమార్తె గురువారం మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్ వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి చేరుకుంది.
లోపలకు వెళ్లి చూడగా, రక్తపుమడుగులో తల్లి అచేతన స్థితిలో ఉండటాన్ని గమనించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సత్య అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించి.. వివరాలు సేకరించి dead bodyని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు..
ఘటనపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు మృతురాలి throt భాగంలో కోసినట్లుగా ఉండటం, తలపై పలుచోట్ల గాయలు ఉండడంతో కిరాయి వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చని మొదట భావించారు. ఘటనా స్థలంలో finger printsను సేకరించారు. జాగిలాల ను రప్పించారు. అవి కరెంట్ ఆఫీస్ పరిసరాల వరకు వెళ్లడాన్ని బట్టి మృతురాలికి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అని ఆరా తీయగా వివాహేతర సంబంధం విషయం వెలుగు చూసింది. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.
చడ్డీ గ్యాంగ్ గా అనుమానిస్తున్న ఇద్దరిని పట్టుకున్న పోలీసులు
ఇంటి పరిసరాల్లోని లక్కీ బార్ వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా రాత్రి 8.30 గంటల గంటల సమయంలో మల్లేశ్వరి క్యారీబ్యాగ్ తో బార్ పక్క వీధిలోకి వెళ్లినట్లుగా తేలడంతో ఆమెతోపాటు భర్త ఆదినారాయణలను శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పథకం ప్రకారం బ్లేడు, చాకుతో సత్య ఇంటికి వెళ్లి గొడవ పడిన మల్లేశ్వరి మొదట బ్లేడుతో ఆమె గొంతు భాగంలో కోసింది.
తర్వాత అక్కడే ఉన్న రోకలిబండతో తలపై పలుమార్లు మోదడంతో ఘటనాస్థలంలో సత్య మృతి చెందింది. ఆ తర్వాత మల్లేశ్వరి వెళ్ళిపోయింది. హత్యకు పాల్పడినట్లు నిందితురాలు ఒప్పుకుందని, అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కృష్ణలంక సీఐ పి.సత్యానందం వెల్లడించారు. హత్య జరిగిన ఇంటిని సౌత్ జోన్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు.