Asianet News TeluguAsianet News Telugu

చడ్డీ గ్యాంగ్ గా అనుమానిస్తున్న ఇద్దరిని పట్టుకున్న పోలీసులు

ఏపీలో చెడ్డి గ్యాంగ్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చెడ్డీగ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  చెడ్డీ గ్యాంగ్ గా అనుమానిస్తున్న ఇద్దరిని ఈరోజు స్థానికుల సహాయంతో పట్టుకున్నారు. 

Police arrested two people suspected to be the Chaddi gang
Author
Vijayawada, First Published Dec 10, 2021, 8:19 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చెడ్డీగ్యాంగ్ ఆగ‌డాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వారిని ప‌ట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. నిన్న గుంటూరు జిల్లా పోలీసులు అనుమానితుల ఫొటోలు విడుద‌ల చేశారు. శుక్ర‌వారం చెడ్డీ గ్యాంగ్ గా అనుమానిస్తున్న ఇద్ద‌రినీ విజ‌య‌వాడ పోలీసులు ప‌ట్టుకున్నారు. విజ‌యవాడ న‌గ‌ర శివారులో క‌నిపించిన అనుమానితుల‌ను స్థానికుల సహాయంతో పోలీసులు బంధించారు. 

ఏపీలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.... కరుడుగట్టిన ముఠా సభ్యులు వీళ్లే

కొన్ని రోజులుగా వరుస దొంగతనాలు..
గ‌త కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరుస దోపిడీలు జ‌రుగుతున్నాయి. ఈ దోపిడిల‌కు పాల్ప‌డుతున్న‌ది ఎవ‌రన్న తెలుసుకునేందుకు పోలీసులు  తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ముఠా కదలికలపై నిఘా పెట్టారు. దొంగతనం జరిగిన లభించిన ఆనవాళ్లను, సీసీ కెమెరా ఫుటేజ్ ల ఆధారంగా పలు ఫొటోలను ఇప్పటికే పోలీసులు విడుద‌ల చేశారు. వారు ఎక్క‌డ క‌నిపించినా పోలీసుల‌కు స‌మాచారం అందించాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కోరారు. 
వ‌రుస దొంగత‌నాల‌కు పాల్ప‌డుతూ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్న చెడ్డీ గ్యాంగ్ గుజ‌రాత్ కు చెందిన వార‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. గుజ‌రాత్ నుంచే ఏపీకి వ‌చ్చార‌ని పోలీసులు భావిస్తున్నారు. వారి ఫొటోలను ఇప్పటికే విడుదల చేసినందున వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

ప్రజలకు పోలీసుల సూచనలు..
ఏపీలో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. అయితే ప్ర‌జ‌లు కూడా  జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. ఎవరైనా అనుమానంగా క‌నిపిస్తే వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాల‌ని కోరారు. రాత్రి స‌మ‌యంలో ఎవరైనా కొత్త వారు తలుపుకొడితే జాగ్ర‌త్తగా ఉండాల‌ని సూచించారు. శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంటుందని, కాబ‌ట్టి ఆ ప్రాంతం ప్ర‌జ‌లు అలెర్ట్ గా ఉండాల‌ని అన్నారు. అనుమానం వ‌స్తే వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాల‌ని కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios