Asianet News TeluguAsianet News Telugu

తిరుపతిలోని ప్రైవేట్ లాడ్జీలో జంట హత్యల కలకలం: పోలీసుల అదుపులో నిందితుడు

తిరుపతిలోని  ఓ ప్రైవేట్ లాడ్జీలో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. ఓ యువకుడు, మహిళను యువరాజు అనే వ్యక్తి హత్య చేశాడు. .ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Wife and Husband killed  in  Tirupati Lodge lns
Author
First Published Oct 6, 2023, 9:59 AM IST | Last Updated Oct 6, 2023, 10:10 AM IST


తిరుపతి: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని  ఓ ప్రైవేట్ లాడ్జీలో యువకుడు, మహిళను యువరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన  సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో హర్షవర్ధన్, మహిళ, యువరాజు, ఇద్దరు పిల్లలు వచ్చారు.  వీరంతా తిరుపతిలోని ఓ లాడ్జీలో ఉన్నారు.  అయితే గురువారం నాడు రాత్రి ఆర్ధిక లావాదేవీల విషయమై  హర్షవర్ధన్,  యువరాజు, మహిళ మధ్య ఘర్షణ చోటు చేసుకుందని సమాచారం.దీంతో యువరాజు   హర్షవర్ధన్, మహిళను హత్య చేశాడు. ఆ తర్వాత  ఇద్దరు పిల్లలతో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. 

ఈ హత్యలు  ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం  మహారాష్ట్రలోని నాందేడ్ నుండి  ఓ కుటుంబం  తిరుపతికి వచ్చింది.  తిరుపతిలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో బస చేసింది.  అయితే  లాడ్జీలోని రూమ్ నెంబర్ 302 లో  హర్షవర్ధన్, మహిళను  యువరాజు హత్య చేశాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.  ఈ విషయమై తిరుపతి అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios