చంద్రబాబునాయుడు ప్రభుత్వం రివర్స్ లో నడుస్తోంది. ఎక్కడైనా ప్రతిపక్షం అధికారపక్షాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. సందు దొరికితే చాలు ఆరోపణలు, ఆందోళనలు, నిరసనలు తదితర మార్గాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని ప్రయత్నిస్తుంటుంది. కానీ, చంద్రన్న నేతృత్వంలోని తెలుగుదేశంపార్టీ అయినా మంత్రులైనా ఒకటే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం రివర్స్ లో నడుస్తోంది. ఎక్కడైనా ప్రతిపక్షం అధికారపక్షాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. సందు దొరికితే చాలు ఆరోపణలు, ఆందోళనలు, నిరసనలు తదితర మార్గాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని ప్రయత్నిస్తుంటుంది.

కానీ, చంద్రన్న నేతృత్వంలోని తెలుగుదేశంపార్టీ అయినా మంత్రులైనా ఒకటే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అదే ‘టార్గెట్ జగన్మోహన్ రెడ్డి’. అధికారంలోని పార్టీ నేతలు, మంత్రులు మొత్తం జగన్నే లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్నారు.

తాజాగా జరిగిన పరిణామం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. నవంబర్ 6వ తేదీ నుండి 3 వేల కిలోమీటర్ల పాదయాత్రను జగన్ మొదలుపెడుతున్నారు. కేసుల విచారణలో భాగంగా ప్రస్తుతం జగన్ ప్రతీ శుక్రవారం కోర్టులో వ్యక్తిగత హాజరు వేసుకోవాలి.

పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రతీశుక్రవారం కోర్టులో హాజరవ్వాలంటే ఎంతైనా ఇబ్బందే. అందుకే వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్టులో పిటీషన్ వేసారు.

సరే, కోర్టు జగన్, సిబిఐ తరపున న్యాయవాదుల వాదనలు విన్నది. ప్రతీవారం కాకుండా నెలకోసారి కోర్టుకు వస్తే చాలని చెప్పింది కోర్టు. నిజానికి జగన్ కు పెద్ద ఊరటే. అంతేకాకుండా అది జగన్ వ్యక్తిగత విషయం కూడా. ఇంతవరకూ ఏ కేసులోనూ జగన్ ను కోర్టు తప్పు పట్టలేదు.

ఎప్పుడైతే, జగన్ కు కోర్టు నుండి ఊరట లభించిందో అప్పటి నుండి మంత్రులు, నేతలు రెచ్చిపోతున్నారు. అవినీతిపరుడని, కేసుల్లో ముద్దాయని, ఇంత అవినీతిపరుడు దేశంలోనే లేడంటూ తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

నిజానికి జగన్ గురించి అంతగా మాట్లాడాల్సిన అవసరం మంత్రులకు లేదు. పార్టీ నేతలు మాట్లాడారంటే సరిపెట్టుకోవచ్చు. కానీ మంత్రులు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఆవు వ్యాసమే అని చెప్పుకోవాలి.

జగన్ పై టిడిపి చేస్తున్న ఆరోపణల్లో కొత్తది ఒక్కటీ లేదు. అన్నీ పోయిన ఎన్నికల్లో చేసినవే. కానీ అవే ఆరోపణలు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటేనే అర్ధమైపోతోంది టిడిపి జగన్ ను ఎంతలా టార్గెట్ చేస్తోందో.