ఎయిర్‌ఏషీయా‌పై టిడిపి నేతలు ఎందుకు భయపడుతున్నారు: జీవీఎల్

Why Tdp leaders responded on Air Asia fraud asks Bjp MP GVL Narasimha Rao
Highlights

ఎయిర్‌ఏషీయాపై టిడిపి నేతలకు ఉలుకెందుకు?

అమరావతి: రాజకీయ మనుగడ కోసమే  కేంద్రంలోని బిజెపిపై టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు  చెప్పారు.ఎయిర్‌ఏషీయా కుంభకోణంపై ఏపీ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు ఎందుకు భయపడుపడుతున్నారని పరోక్షంగా టిడిపి నేతలపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీతో పాటు ఇతరుల ఫోన్లను కూడ ఏపీ ప్రభుత్వ పెద్దలు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.


 బుధవారం నాడు  విజయవాడలో బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు.ఏపీ రాష్ట్ర ప్రభుత్వం  బిజెపిపై తప్పుడుపై ప్రచారం చేస్తోందన్నారు.  రాజకీయాలు మానుకోని రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు టిడిపి దృష్టి పెట్టాలని జీవీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

కృష్ణపట్టణం పోర్టు నిర్మాణం అభివృద్ది కోసం అవసరమైన భూమిని సేకరించి ఆ భూమిని  బదిలీ చేస్తే కేంద్రం నిధులను మంజూరు చేస్తోందన్నారు.ఎయిర్‌ఏషీయా 
 అవినీతికి పాల్పడిందని వార్తలు వచ్చిందని మీడియాలో వార్తలు వచ్చిందన్నారు. 

ఈ అవినీతికి తమకు సంబంధం లేదని భుజాలు తడుముకొన్నారని పరోక్షంగా ఏపీ ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మెన్ కుటుంబరావుపై విమర్శలు గుప్పించారు. సీబీఐ విచారణ చేస్తోందన్నారు. కేంద్రానికి చెందిన కుంభకోణాన్ని కూడ బయటపెడతామని కూడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వారు కొందరు ప్రకటించడంపై తమకు ఇబ్బందులు లేవన్నారు.


సింగపూర్ కు చెందిన  ఓ కంపెనీకి ముడుపులు చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వార్తలతో రాష్ట్రానికి చెందిన ప్రముఖులు భయపడినట్టున్నారని జీవీఎల్ నరసింహారావు పరోక్షంగా టిడిపి నేతలపై విమర్శలు గుప్పించారు. తప్పు చేసిన వాడే భయపడుతాడని ఆయన చెప్పారు. ఈ విషయమై సీబీఐ విచారణ చేస్తోందన్నారు. ఎయిర్ ఏసీయా కుంభకోణంపై ఎవరో మాట్లాడుకొంటే ఏపీ రాష్ట్రానికి చెందిన నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.ఈ విషయమై మీడియాలో వచ్చిన వార్తలను ఆయన చదివి విన్పించారు. వైజాగ్- చెన్నై కారిడార్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా చేయాల్సి ఉందన్నారు.ఈ కారిడార్ పూర్తైతే  30 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు.

అబద్దాలు చెబితే కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు రావన్నారు. తమపై బురద చల్లితే  ఆ బురద తమపై ఆరోపణలు చేసిన వారికే అంటుందన్నారు. డొలెరో తో అమరావతిని పోల్చలేమన్నారు.

రాష్ట్రంలోని వందలాది మంది రాజకీయ పార్టీల నేతల ఫోన్ సంభాషణలను రాష్ట్ర ప్రభుత్వం వింటున్నారని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం అభద్రతలో ఉందన్నారు. దీని కోసం ఫోన్లను వింటున్నారని ఆయన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వింటున్నారని చెప్పారు.    
  


  
 

loader