Asianet News TeluguAsianet News Telugu

సింగపూర్ కంపెనీలతో ఏమిటి బంధం?

ప్రభుత్వమే భూమిని డెలవప్ చేసి, మౌళికసదుపాయాలు కల్పిస్తే సింగపూర్ కంపెనీలేమో ఆ భూమిని ప్లాట్లుగా వేసి అమ్ముతుందట. ఈ మాత్రానికే మెజారిటీ వాటాను సింగపూర్ కంపెనీలకు ఎవరైనా ఎందుకు ఇస్తారు? పైగా రూ. 5721 కోట్లు పెట్టుబడులుగా పెట్టిన ప్రభుత్వానికి దక్కేది కేవలం రూ. 372 కోట్లు మాత్రమే.

Why naidu opting only Singapore companies for amaravati construction

ఆరు నూరైనా అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబునాయుడు సింగపూర్ కంపెనీలకే కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్షాలు, మేధావులు,  న్యాయస్ధానాలు ఎంత ఆక్షేపించినా చంద్రబాబు తన పద్దతిని మార్చుకోవటానికి ఇష్టపడటం లేదంటేనే విషయం అర్ధమైపోతోంది. తనకు ఇష్టమైన సింగపూర్ కంపెనీలకు రాజధాని నిర్మాణాన్ని కట్టబెట్టాలనుకున్నారు కాబట్టే సర్వం గోప్యంగా ఉంచుతున్నారు.

సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను బయటపెట్టాలంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారులు అడిగినా ఒప్పందాలను ప్రభుత్వం బయటపెట్టటం లేదంటేనే లోపాయికారీగా ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ప్రతీ ఒక్కరికీ వస్తున్న అనుమానం ఏమిటంటే అన్నీ వర్గాలూ వ్యతిరేకిస్తున్నా రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబునాయుడు సింగపూర్ కన్షార్టియంకే ఎందుకు అప్పగిస్తున్నారు? స్టార్టప్ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబునాయుడు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల దుర్వినియోగానికి సిద్ధపడుతున్నారన్న విషయమై సర్వత్రాచర్చ జరుగుతోంది. పేరుకు, ప్రచారంలో మాత్రమే పారదర్శకత, ఆచరణలో మాత్రం సర్వం గోప్యతే.

1691 ఎకరాల భూమితో పాటు రూ. 5729 కోట్లను ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంటే సింగపూర్ కంపెనీలు మాత్రం రూ. 306 కోట్లు మాత్రమే పెట్టుబడిగా పెడుతున్నాయ్. విచిత్రమేమంటే వేల కోట్లు పెడుతున్న ప్రభుత్వానికి లాభాల్లో ఎంత వాటా దక్కాలన్నది సింగపూర్ కంపెనీలు నిర్ణయించటం. లాభాల్లో ప్రభుత్వానికి దక్కుతున్నది కేవలం 42 శాతం మాత్రమే.

మామూలుగా అయితే పెట్టుబడుల దామాషాలో అయితే, ప్రభుత్వానికి దక్కాల్సింది తక్కువలో తక్కువ 85 శాతం. కానీ ఇది చంద్రన్న జమానా కాబట్టి మెజారిటీ వాటా సింగపూర్ కంపెనీలకు దక్కుతోంది. ఇక్కడే అందరికీ అనుమానాలు వస్తున్నాయి.

ఇదే విషయాన్ని న్యాయస్ధానాలు కూడా ఆక్షేపించినా చంద్రబాబు మాత్రం ఖాతరు చేయటం లేదు.  ప్రభుత్వమే భూమిని డెలవప్ చేసి, మౌళికసదుపాయాలు కల్పిస్తే సింగపూర్ కంపెనీలేమో ఆ భూమిని ప్లాట్లుగా వేసి అమ్ముతుందట. ఈ మాత్రానికే మెజారిటీ వాటాను సింగపూర్ కంపెనీలకు ఎవరైనా ఎందుకు ఇస్తారు? పైగా రూ. 5721 కోట్లు పెట్టుబడులుగా పెట్టిన ప్రభుత్వానికి దక్కేది కేవలం రూ. 372 కోట్లు మాత్రమే.

ఎవరైనా వేల కోట్లు పెట్టుబుడులుగా పెడితే అంతకు మించి ఆదాయాన్ని ఆశిస్తారు. మరి ప్రభుత్వం మాత్రం ఎందుకు రివర్స్ లో ఆలోచిస్తోంది? ఈ మాత్రానికి సింగపూర్ కంపెనీలే ఎందుకు? దేశంలోని పెద్ద కంపెనీల్లో ఏ ఒక్కటైనా సరిపోతుంది కదా? పైగా ఏవైనా న్యాయపరమైన సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోవచ్చు కూడా. అదే సింగపూర్ కంపెనీలైతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ ఆలోచించకుండానే చంద్రబాబు సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారా?   

Follow Us:
Download App:
  • android
  • ios