Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాలకు భంగపాటు

  • తాజా కేంద్రమంత్రివర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు భంగపాటు తప్పలేదు.
  • మంత్రివర్గ విస్తరణలోని నలుగురు సహాయమంత్రులకు క్యాబినెట్ మంత్రులుగా ప్రమోషన్ లభించగా కొత్తగా 9మందిని సహాయమంత్రులుగా తీసుకున్నారు.
  • సహాయమంత్రుల్లో నలుగురు అఖిల భారత సర్వీసులకు చెందిన మాజీ అధికారులు కావటం గమనార్హం.
  • విచిత్రమేంటంటే కొత్తగా తెలుగువాళ్ళెవరినీ తీసుకోక పోగా ఉన్న వాళ్ళని కూడా తొలగించారు.
Why modi kept telugu states away from new cabinet

తాజా కేంద్రమంత్రివర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు భంగపాటు తప్పలేదు. మంత్రివర్గ విస్తరణలోని నలుగురు సహాయమంత్రులకు క్యాబినెట్ మంత్రులుగా ప్రమోషన్ లభించగా కొత్తగా 9మందిని సహాయమంత్రులుగా తీసుకున్నారు. సహాయమంత్రుల్లో నలుగురు అఖిల భారత సర్వీసులకు చెందిన మాజీ అధికారులు కావటం గమనార్హం. విచిత్రమేంటంటే కొత్తగా తెలుగువాళ్ళెవరినీ తీసుకోక పోగా ఉన్న వాళ్ళని కూడా తొలగించారు.

కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్ళిపోవటంతో ఆస్ధానాన్ని భర్తీ చేయాలి. అలాగే తెలంగాణా నుండి కార్మికశాఖ సహాయమంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను తొలగించటంతో ఆస్ధానం ఖాళీ అయింది. అయితే, రెండు స్ధానాలనూ ప్రధానమంత్రి నరేంద్రమోడి భర్తీ చేయలేదు. తెలంగాణా నుండి మురళీధర్ రావు, ఏపి నుండి కంభంపాటి హరిబాబు పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినా అవన్నీ కేవలం ప్రచారం మాత్రమేనని తేలిపోయింది.

తాజా పరిణామాలతో కేంద్ర క్యాబినెట్లో అశోక్ గజపతిరాజు మాత్రమే మిగిలారు. ఉండటానికి నిర్మాల, సురేష్ ప్రభు ఏపి నుండే రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నా వాళ్ళిద్దరు తెలుగు వాళ్ళు కాదన్న విషయం తెలిసిందే.

తాజా పరిణామాలతో తెలుగురాష్ట్రాలపై మోడి వివక్ష చూపినట్లే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలుండగా అన్నీ రాష్ట్రాలకూ ఎంతో కొంత ప్రాతినిధ్యం కలిపిస్తారని భావించిన వారికి తీవ్ర నిరాసే ఎదురైంది. వెంకయ్యనాయుడు మద్దతుతో విశాఖపట్నం ఎంపి హరిబాబుకు మంత్రివర్గంలో చోటు ఖాయమనే ఆ పార్గీ వర్గాలు కుడా భావించాయి. దానికితోడు హరిబాబు శనివారం సాయంత్రి హడావుడిగా కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్ళటంతో మంత్రిపదవి ఖాయమనే అనుకున్నారు. తీరా చూస్తే భంగపాటు తప్పలేదు.

 

Follow Us:
Download App:
  • android
  • ios