నంద్యాల ఉపఎన్నికలో గెలిచిన తర్వాత మంత్రి భూమా అఖిలప్రియ చాలా ఓవర్ యాక్షన్ చేస్తోంది. పదే పదే రాజకీయ సన్యాసం గురించి ప్రస్తావిస్తూ వారిని అవహేళన చేస్తోంది. ఒకవేళ టిడిపి గనుక ఓడిపోయుంటే అఖిలప్రియ రాజకీయ సన్యాసం తీసుకునుండేదేనా?
నంద్యాల ఉపఎన్నికలో గెలిచిన తర్వాత మంత్రి భూమా అఖిలప్రియ చాలా ఓవర్ యాక్షన్ చేస్తోంది. శుక్రవారం నంద్యాల టౌన్లో జరిగిన విజయోత్సవ సభలో మాట్లాడుతూ ‘ప్రజలముందుకు వచ్చి రాజకీయ సన్యాసం చేస్తానని శిల్పా మోహన్ రెడ్డి చెప్పేవరకూ వదిలిపెట్ట’నని శపథం చేసారు. ఎన్నికలన్నాక ఒకరినొకరు అనేక మాటలనుకోవటం సహజం. కొన్ని చోట్ల రాజకీయ సన్యాసమంటూ శపథాలు కూడా చేస్తుంటారు. మళ్ళీ ఎన్నికలయ్యాక వాటిని ఎవరు పట్టించుకోరు. ఎక్కడైనా జరిగేదే ఇది. నంద్యాలలో కుడా జరిగిందదే.
కానీ ఎన్నికల తర్వాత మంత్రి అఖిల మాత్రం మరీ రెచ్చిపోతున్నారు. గెలిచిన దగ్గర నుండి ఓడిపోయిన శిల్పా మోహన్ రెడ్డి గురించి సోదరుడు చక్రపాణిరెడ్డి గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతోంది. పదే పదే రాజకీయ సన్యాసం గురించి ప్రస్తావిస్తూ వారిని అవహేళన చేస్తోంది. ఒకవేళ టిడిపి గనుక ఓడిపోయుంటే అఖిలప్రియ రాజకీయ సన్యాసం తీసుకునుండేదేనా?
ఓడిపోయిన అభ్యర్ధి గిలిచిన అభ్యర్ధిపై అనేక ఆరోపణలు చేయటం సహజం. ఎందుకంటే, బాదలో అనేకం మాట్లాడుతారు. కానీ ఇక్కడ వైసీపీ అభ్యర్ధి ఏం మాట్లాడలేదు. గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి కుడా ఏమీ మాట్లాడటం లేదు. మధ్యలో అఖిలే రెచ్చిపోతోంది. నిజానికి నంద్యాలలో టిడిపి ఎలా గెలిచిందో అందరూ చూసిందే. కాబట్టి గెలుపుపై అఖిల ఎంత తక్కువ మాట్లాడితే అంత హుందాగా ఉంటుంది. అలా కాదని వెంటపడి తరిమినట్లుగా శిల్పా సోదరులను వేధిస్తే మాత్రం భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదు.
