Asianet News TeluguAsianet News Telugu

నిప్పు చంద్రబాబు ఇపుడేం చెబుతారు?

ఎప్పుడూ బీద మాటలు మాట్లేడే, జగన్ అవినీతిపై అంతెత్తున ఎగిరిపడే సోమిరెడ్డి అక్రమంగా వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడని కాకాని చేసిన ఆరోపణలతో కలకలం రేగింది.

why keeping mum over Somireddy issue

వైసీపీ దెబ్బకు సోమిరెడ్డి దిమ్మతిరిగింది. తన అవినీతి సంపాదనపై ప్రతిపక్ష ఎంఎల్ఏ చూపించిన డాక్యుమెంట్లతో ఎంఎల్సీ నోరు పడిపోయింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సంచలనం రేపుతున్న కాకాని-సోమిరెడ్డి వ్యవహారంపై నిప్పు చంద్రబాబు ఇపుడు ఏమి చెబుతారో చూడాలి.

 

నిత్యమూ నీతి, నిజాయితీ గురించే మాట్లాడే చంద్రబాబు నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారో అర్ధం కావటం లేదు.

 

టిడిపి నేత, ఎంఎల్సీ సోమిరెడ్డిపై వైసీపీ ఎంఎల్ఏ కాకాని గోవర్ధన రెడ్డి మూడు రోజులుగా సంచలన ఆరోపణలు గుప్పిస్తున్నారు. తన ఆరోపణలకు ఆధారాలను కూడా కాకాని మీడియా ముందుంచారు.

 

ఎప్పుడూ బీద మాటలు మాట్లేడే, జగన్ అవినీతిపై అంతెత్తున ఎగిరిపడే సోమిరెడ్డి అక్రమంగా వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడని కాకాని చేసిన ఆరోపణలతో కలకలం రేగింది.

 

సోమిరెడ్డికి ఏఏ దేశాల్లో ఎంతెంత వ్యవసాయ భూములున్నాయి, పెట్టుబడులున్నాయి, ఏ బ్యాంకుల్లో ఎంతెంత డిపాజిట్లున్నాయన్న విషయాలను డాక్యుమెంట్ ఆధారాలతో సహా బయటపెట్టారు. దాంతో సోమిరెడ్డికి దిమ్మతిరిగింది. అంతేకాకుండా సింగపూర్, హాంకాంగ్, కెనడ, మేలిషియా దేశాల్లోని ఆస్తులు ఎవరెవరి పేర్లతో ఉన్నాయన్న విషయం కూడా వివరించారు.  

 

 

ఇదంతా ఓ ఎత్తైతే గడచిన కొంత కాలంగా సోమిరెడ్డి విదేశాల్లోని ఎవరెవరితో, ఎంతెంత సేపు ఫోన్లలో మాట్లాడారు? ఏఏ నెంబర్లకు ఎంతెంత సేపు మాట్లాడారన్న కాల్ లిస్టు కూడా బయటపెట్టారు. కాకాని చేసిన ఆరోపణలపై, బయటపెట్టిన డాక్యుమెంట్లతో  సోమిరెడ్డి నోరు పడిపోయింది.

 

కాకాని వెల్లడించిన డాక్యుమెంట్లతో సోమిరెడ్డి కూడా అత్యంత అవినీతిపరుడే అని ప్రచారం జరుగుతోంది. ఇన్ని వివరాలు బయటపెట్టిన కాకాని వద్ద సోమిరెడ్డి విదేశాల్లోని వారితో ఏమేమి మాట్లాడారన్న వివరాలు ఉండకుండా ఉంటాయా. విదేశాల్లో సోమిరెడ్డి అంత భారీగా ఆస్తులు కూడబెట్టటం నిప్పు చంద్రబాబుకు తెలీకుండా సాధ్యమా? అందుకేనేమో నిప్పు వారు ఏమి మాట్లాడటం లేదనే సందేహం వస్తోంది అందరికీ.  

 

కామిడి ఏమిటంటే తనపై వచ్చిన ఆరోపణలను వైసీపీ రుజువు చేయాలని ఇంకా సోమిరెడ్డి బుకాయిస్తుండటం. అధికార పార్టీ నేతలపై వచ్చే ఆరోపణలను విచారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న కనీస ఇంగితం కూడా సోమిరెడ్డికి లేకపోవటం విచిత్రం.

 

Follow Us:
Download App:
  • android
  • ios