నంద్యాలతో పోల్చితే కాకినాడలో తగ్గిన పోలింగ్ శాతం. 80 పూగా నంద్యాల పోలింగ్ శాతం. దాదాపుగా 67 శాతం వద్ద ఆగిన కాకినాడ పోలింగ్.
వారం రోజుల గ్యాప్ లోనే నంద్యాల, కాకినాడ ఎన్నికలు జరిగాయి. కానీ ఒక విషయంలో మాత్రం పొంతన లేని వ్వవహారం బయటకొచ్చింది. నంద్యాలలో గ్రాఫ్ అద్భుతంగా ఉండగా కాకినాడలో దారుణంగా పడిపోయింది. ఇంతకూ నంద్యాలలో అలా, కాకినాడలో ఇలా ఎందుకైంది? ఏమైందనుకుంటున్నారా? ఈ స్టోరీ చదవండి.
నంద్యాలలో ఓటింగ్ పోటెత్తింది. అక్కడ ఓటర్లు ఉదయం నుంచి రాత్రి వరకు బారులు తీసి ఓట్లేశారు. సుమారు అక్కడ 80 శాతానికి మించి ఓటింగ్ నమోదైంది. కానీ కాకినాడలో కేవలం 67 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక కాకినాడ రూరల్ లో కొంత పోలింగ్ ఊపుమీద కనబడింది కానీ అర్బన్ ప్రాంతంలో ఓటింగ్ మరీ మందకొండిగా సాగింది.
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం సెలవు ఇవ్వలేదు. సాధారణంగా కీలకమైన ఎన్నికలకు సెలవులు ఇస్తారు. కానీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు సెలవు దినంగా ప్రకటించలేదు. దీంతో పోలింగ్ పై ఆ ప్రభావం పడిందని కొందరు కార్యకర్తలు పేర్కొన్నారు
కాకినాడ నగర పాలక ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 241 మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. కాకినాడలో నగర కార్పొరేషన్ పరిధిలో 196 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతాల్లోని ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. నగరంలోని మాత్రం మొదటి నుండి కొంత మందకొడిగా ఓటింగ్ జరిగింది. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వారిని కదిలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా సాయంత్రం వరకు 67 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఓటర్ ఐడీ కార్డు ఉన్నా చాలాచోట్ల జనం ఓటుహక్కు వినియోగించులేకపోయారు. పోలింగ్ సందర్భంగా సెలవు ఇవ్వకపోవడంతో చాలా మంది ఓట్లు వినియోగించుకోలేకపోయారు. ఓట్ల లెక్కింపు సెప్టెంబరు 1వ తేదీన జరగనుంది. కాకినాడ పురపాలక పరిధిలో మొత్తం 2,29,373 మంది ఓటర్లు ఉన్నారు.
మరిన్ని తాజా విశేషాల కోసం కింద క్లిక్ చేయండి
