Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు నిర్ణయంతో టిడిపి నేతలకు షాక్

  • చంద్రబాబునాయుడు ఒక్కోసారి ఒక్కోలాగా మాట్లుడుతుంటంతో టిడిపి నేతలు విస్తుపోతున్నారు.
Why chandrababu taken U turn on special status

చంద్రబాబునాయుడు ఒక్కోసారి ఒక్కోలాగా మాట్లుడుతుంటంతో టిడిపి నేతలు విస్తుపోతున్నారు. తాజాగా ప్రత్యేకహోదాతో రాష్ట్రానికి ఏమొస్తుంది? అంటూ చంద్రబాబు ప్రశ్నతో టిడిపి నేతలే షాక్ కు గురయ్యారు. కేంద్రం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపధ్యంలో రాష్ట్రంలో కానీ పార్లమెంటులో కానీ వేడిపెరిగిపోయింది.

బడ్జెట్లో ఏపి ప్రయోజనాలపై ఒక్క ప్రస్తావన కూడా లేకపోవటంతో రాష్ట్ర ప్రజానీకం భగ్గుమంది, దాంతో ఎంపిల రాజీనామాలకు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 5 ముహూర్తంగా ఫిక్స్ చేశారు. దాంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రత్యేకహోదా చుట్టూనే తిరుగుతున్నాయ్. వైసిపితో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ కూడా ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తోంది.

ఇటువంటి నేపధ్యంలోనే చంద్రబాబు కూడా తప్పనిసరి పరిస్ధితిలో ప్రత్యేకహోదా రాగమందుకున్నారు. దాంతో కేంద్రమంత్రులు, ఎంపిలు, రాష్ట్రమంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు కూడా ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ పదే పదే డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో చంద్రబాబు చేసిన ఓ ప్రకటనతో టిడిపి నేతలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రత్యేకహోదా వల్ల ఏమొస్తుందంటూ ప్రశ్నించటం కలకలం రేపింది. హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే మంచిదన్నారు. ఏదో హక్కుగా అడుగుతున్నాం కానీ ప్రత్యేకహోదా వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని చంద్రబాబే తేల్చేశారు. పోలవరానికి నిధులొస్తాయా? రాజధానికి నిధులు వస్తాయా? లోటు భర్తీ అవుతుందా? అంటూ ప్రశ్నించటంతో టిడిపి నేతలే విస్తుపోతున్నారు.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో చంద్రబాబు ఎందుకు యు టర్న్ తీసుకున్నారో ఎవరికీ అర్ధం కావటం లలేదు. మరి ఇవన్నీ తెలీకుండానే ఇన్ని రోజులూ పార్లమెంటులోను, బయట ఎంపిలు ప్రత్యకహోదా కోసం పోరాటం జరిపారా? అని నేతలు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios