పోలవరం కాంట్రాక్టర్ ను మార్చే విషయంపైనే చంద్రబాబునాయుడు మంగళవారం నాగ్ పూర్ వెళుతున్నారా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఎందుకంటే, పోలవరం పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్ధ విషయంలో ఇటు చంద్రబాబునాయుడు అటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకనే గడ్కరీని కలిసేందుకే చంద్రబాబు నాగ్ పూర్ వెళుతున్నట్లు సమాచారం.
పోలవరం కాంట్రాక్టర్ ను మార్చే విషయంపైనే చంద్రబాబునాయుడు మంగళవారం నాగ్ పూర్ వెళుతున్నారా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఎందుకంటే, పోలవరం పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్ధ విషయంలో ఇటు చంద్రబాబునాయుడు అటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకనే గడ్కరీని కలిసేందుకే చంద్రబాబు నాగ్ పూర్ వెళుతున్నట్లు సమాచారం.
పోలవరం పనులను ట్రాన్ స్ట్రాయ్ సంస్ధ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గుంటూరు టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావుదే కాంట్రాక్ట్ సంస్ధ అన్నవిషయం కూడా తెలిసిందే కదా? అయితే, కాంట్రాక్టును దక్కించుకున్న సంస్ధ పనులను మాత్రం చేయటం లేదు. అసలు సామర్ధ్యంలేని లేని సంస్ధకు చంద్రబాబు పట్టుబట్టి మరీ పనులు ఇప్పించుకున్నారు.

విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. నిబంధనల ప్రకారం జాతీయ ప్రాజెక్టును కేంద్రమే టేకప్ చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా చంద్రబాబు కేంద్రం నుండి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. కాంట్రాక్ట్ సంస్ధ కోసమే ప్రాజెక్టు అంచనా వ్యయాలను కూడా ఎప్పటికప్పుడు పెంచుతున్నట్లు కూడా చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. అయితే, ఇంత చేసినా కాంట్రాక్టు సంస్ధ మాత్రం పనులను స్పీడ్ చేయలేకపోతోంది.

అదే విషయమై చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేసారు. పనులు జరుగుతున్న పద్దతిని చూస్తే 2019లోగా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు లేవన్నది చంద్రబాబుకు అర్ధమైనట్లుంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఇబ్బందే. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును చూపించే ఎన్నికలను ఎదుర్కోవాలన్నది చంద్రబాబు ఆలోచన. రాజధాని గురించి పక్కనబెడితే చంద్రబాబు సిఎం అయ్యేనాటికే పనులు జరుగుతున్నాయి. అయితే వివిధ కారణాల వల్ల మూడున్నరేళ్ళుగా పనులు నత్తనడక నడుస్తున్నాయి.
ఈ నేపధ్యంలోనే కాంట్రాక్ట్ సంస్ధ ట్రాన్ స్ట్రాయ్ ను మార్చాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే, ఇప్పడు కాంట్రాక్ట్ సంస్ధను మారిస్తే మళ్ళీ అంచనా వ్యయాలు పెరుగుతాయి కాబట్టి సాధ్యం కాదని కేంద్రంమంత్రి చెబుతున్నారు. అంటే ఒకే విషయమై సిఎం, కేంద్రమంత్రి భిన్నమైన ఆలోచనగా స్పష్టమవుతోంది. కాబట్టి కేంద్రమంత్రిని ఒప్పించి కాంట్రాక్ట్ సంస్ధను మార్పించటానికే చంద్రబాబు నాగ్ పూర్ వెళుతున్నారని సమాచారం. మరి ఏమవుతుందో చూడాలి?
