కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ రోజే ఉభయ తెలుగు రాష్ట్రాల కీలక నేతలతో భాజపా కేంద్రం నాయకత్వం ఎందుకు హడావుడిగా సామావేశం పెట్టింది? ఈ విషయంపైనే ఇపుడంతా చర్చ జరుగుతోంది. ప్రవేశపెడుతున్న బడ్జెట్ కు భాజపా నేతల సమావేశానికి ఏమైనా లింక్ ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి తెలంగాణా సంగంతిని పక్కన పెడితే ఏపిలో అధికారంలో ఉన్నప్పటికీ భాజపా పరిస్ధితి ఏమంతా గొప్పగా లేదు. అవటానికి టిడిపి-భాజపాలు మిత్రపక్షాలే అయినా ప్రతిపక్షాల్లాగే కీచులాటలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇటువంటి పరిస్దితుల్లోనే వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేసేది అనుమానంగానే ఉంది. ఇరుపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్ధాయిలో జరుగుతోంది. తెరవెనుక కారణాలు ఏవైనా పైకి మాత్రం రాష్ట్రప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవటం లేదనే చంద్రబాబునాయుడు మండిపడుతున్నారు. ఈ కారణంతోనే ఇప్పటికే మూడు సార్లు పొత్తులపై చంద్రబాబు కేంద్రానికి హెచ్చరికల్లాంటి వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలను ఏపిలోని భాజపాలోని కొందరు నేతలూ సీరియస్ గానే తీసుకున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లోనే గురువారం కంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. అదే సమయంలో మధ్యాహ్నం జాతీయ నాయకత్వం రెండు రాష్ట్రాల నేతలతో అర్జెంట్ సమావేశం ఏర్పాటు చేసింది. పొత్తులపై, ఒంటరి పోరాటంపై ఏమైనా దిశానిర్దేశం చేయబోతోందా అన్నఅనుమానాలు మొదలయ్యాయి.