పార్టీల పోటాపోటీ చర్యలు చూసిన జనాలు మాత్రం మొత్తానికి ఇద్దరు నేతలూ అపవిత్రులేనని తేలిందని జోకులేసుకుంటున్నారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో శుద్ధి రాజకీయాలు ఊపందుకున్నాయి. అధికార టిడిపి, ప్రతిపక్ష వైసీపీలు పోటా పోటీగా రోడ్లను ఆవు పంచకం, పశుపు నీళ్ళతో శుద్ధి చేస్తున్నాయి. ఇంతకీ విషయమేమిటంటే, జగన్ పర్యటన ద్వారా రాజధాని ప్రాంతం అపవిత్రమైందని టిడిపి నేతలు భావించారు. దాంతో టిడిపి శ్రేణులు జగన్ తిరిగిన రాజధాని ప్రాంతంలో పశుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసారు.
దాన్ని గమనించిన వైసీపీ శ్రేణులు ఊరకుంటాయా? వెంటనే వారు కూడా చంద్రబాబునాయుడు రోజు తిరిగే రహదారిపై గోపంచకం, పశుపు నీళ్లు బిందెలతో చల్లి శుద్ధి చేసారు. జగన్ తిరిగాడని టిడిపి వాళ్ళు, చంద్రబాబు తిరిగే రహదారులను శుద్ధిపేరుత్ వైసీపీ శ్రేణులు పశుపు నీళ్ళు చల్లటం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. పార్టీల పోటాపోటీ చర్యలు చూసిన జనాలు మాత్రం మొత్తానికి ఇద్దరు నేతలూ అపవిత్రులేనని తేలిందని జోకులేసుకుంటున్నారు.
