‘రాజకీయంగా ఎదగటానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు’.. జగన్ ను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలివి. ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో బిసిల విషయంలో జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నట్లు కెఇ ఎద్దేవా చేసారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు చేసిందేంటి ? కాపులను బిసిలో చేరుస్తానని హామీ ఇచ్చిందెవరు?
రాజకీయంగా ఎదగటానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు’.. జగన్ ను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలివి. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో బిసిల విషయంలో జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నట్లు కెఇ ఎద్దేవా చేసారు. పార్టీ పెట్టిన ఇంతకాలానికి ప్రతిపక్ష నేతకు బిసిలు గుర్తుకురావటం విడ్డూరంగా ఉందట.
సరే, కులాల మధ్య చిచ్చుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న కెఇ మాటలు నిజమే అనుకుందాం? మరి, పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు చేసిందేంటి ? కాపులను బిసిలో చేరుస్తానని హామీ ఇచ్చిందెవరు? బహుశా కెఇకి మతిమరుపేమన్నా ఉందేమో? ఎందుకంటే, రిజర్వేషన్ హామీతో కాపు-బిసిల మధ్య చిచ్చుపెట్టిందే చంద్రబాబన్న విషయం ఎవరిని అడిగినా చెబుతారు. పోనీ హామీ ఇచ్చి నిలుపుకున్నారా ? అదీ లేదు కదా? ఒకవైపు కాపులను ఇంకోవైపు బిసిలను ఇప్పటికీ రెచ్చగొడుతూనే ఉన్నారు కదా చంద్రబాబు ?
సరే, ఎంత ప్రయత్నించినా జగన్ ను ఎవరూ నమ్మరని కెఇ జోస్యం కూడా చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో జనాలు ఎవరిని విశ్వసిస్తారో ఇపుడే ఎవరు మాత్రం చెప్పగలరు? వెనుకబడిన వర్గాలు టిడిపిని తమ సొంత పార్టీగా భావిస్తారని, తెలుగుదేశం పార్టీకి బలమైన పునాది బి.సి లే అన్నారు. అంత వరకూ కెఇ సరిగ్గానే చెప్పారు. అయితే, వైఎస్ పాలనలో బి.సిలకు ఎంత అన్యాయం జరిగిందో అన్న కెఇ జరిగిన అన్యాయం ఏంటో మాత్రం చెప్పటం లేదు.
ఎంతకాలమైనా టిడిపి నేతలకు ఒకటే పాట. జగన్ ఫ్యాక్షన నేత అని. కర్నూలు జిల్లాలోని ఫ్యాక్షన్ నేతల పేర్లు చెప్పమంటే అందులో కెఇ పేరు కూడా ముందు వరసలోనే ఉంటుంది. కాకపోతే ఇపుడు వయసు అయిపోయింది, ఫ్యాక్షన్ వాతావరణం కూడా బాగా తగ్గిపోయింది కాబట్టి చాలామంది ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. అటువంటి కెఇ కూడా జగన్ ను ఫ్యాక్షన్ లీడర్ అనటం ఆశ్చర్యంగానే ఉంది. ఫ్యాక్షన్ లీడర్ మనస్తత్వానికి బిసిలకు గౌరవం ఇవ్వటానికి ఏం సంబంధమో కెఇనే చెప్పాలి.
