..‘తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు’. ..‘అలాంటి వ్యక్తి జీవితాన్ని బజారులో పడేసేలా సినిమా తీయకూడదు’ ఎన్టీఆర్ గురించి పురంధేశ్వరి చెప్పినదాంట్లో ఏమీ తప్పు లేదు. కానీ ఎన్టీఆర్ వ్యక్తి జీవితాన్ని బజారునపడేసేలా సినిమా తీయకూడదు అనటమే విచిత్రంగా ఉంది.
..‘తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు’.
..‘ఆయన జీవితం తెరచిన పుస్తకం’
..‘అలాంటి వ్యక్తి జీవితాన్ని బజారులో పడేసేలా సినిమా తీయకూడదు’
--ఇది తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందన. ఎన్టీఆర్ గురించి పురంధేశ్వరి చెప్పినదాంట్లో ఏమీ తప్పు లేదు. కానీ ఎన్టీఆర్ వ్యక్తి జీవితాన్ని బజారునపడేసేలా సినిమా తీయకూడదు అనటమే విచిత్రంగా ఉంది.
ఎందుకంటే, ఎన్టీఆర్ ను తెలుగు ప్రజలు ‘అన్నగారు’ లాగా భావించారు. దాదాపు అందరూ తమ ఇంటి మనిషిగానే భావించారు. అందుకనే 1983తో తెలుగుదేశం పార్టీ స్ధాపించినపుడు అందరూ ఎన్టీఆర్ కు బ్రహ్మరధం పట్టారు. కానీ చివరకు ఏం జరిగింది? కుటుంబసభ్యులే కుట్రచేసి ఎన్టీఆర్ ను పదవి నుండి దింపేసారు. అందులో కూతురుగా పురంధేశ్వరి పాత్ర కూడా తక్కువేం కాదు.

ఎన్టీఆర్ ను పదవి నుండి దింపటమే లక్ష్యంగా అల్లుళ్ళిద్దరూ దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, చంద్రబాబునాయుడు పెద్ద ప్లానే వేసారు. వీరికి కూతుళ్ళు దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి తో పాటు కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ తదితరులు పూర్తి మద్దతు పలికారు. ఎన్టీఆర్ ను పదవి నుండి దింపాలనుకోవటంలో అల్లుళ్ళైనా, కూతుళ్లైనా, కొడుకులైనా ఎవరి వ్యక్తిగత అజెండాలు వారికున్నాయ్.
అందరూ కూడబల్లుక్కునే కుట్ర చేసారు, విజయం సాధించారు. సరే, తర్వాత జరిగిన అంతర్గత కుమ్ములాటలు, కుట్రల ఫలితంగానే వెంకటేశ్వర్రావు, చంద్రబాబుల మధ్య విభేదాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో వెంకటేశ్వర్రావు మళ్ళీ ఎన్టీఆర్ పంచన చేరారు. ఎందుకు చంద్రబాబు ఎత్తుల ముందు ఓడిపోయారు కాబట్టే. లేకపోతే తోడల్లుళ్ళిద్దరూ ఒకటిగానే ఉండేవారే.

అంటే, ఇక్కడ మ్యాటరేంటి? ఎన్టీఆర్ జీవితాన్ని బజారులో పడేసింది కుటుంబ సభ్యులే కానీ అభిమానులో లేక జనాలో ఎంతమాత్రం కాదు. కాకపోతే పురంధేశ్వరి అదృష్టం కొద్దీ రాజకీయంగా పదవులొచ్చాయి. అదికూడా ఎన్టీఆర్ బతికున్నంత కాలం ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే పోరాడారో అదే పార్టీలో చేరి పురంధేశ్వరి ఎంపి అయి కేంద్రమంత్రవ్వటమే విచిత్రం. అంటే ఎన్టీఆర్ ఆశయాలకు గండికొట్టింది, ఎన్టీఆర్ జీవితాన్ని బజారున పడేసింది తామే అన్న విషయాన్ని పురంధేశ్వరి గుర్తుంచుకోవాలి. జీవిత చరమాంకంలో ఎన్టీఆర్ ఇంటర్వ్యూను ఒకసారి చూస్తే తెలుస్తుంది అన్నగారి జీవితాన్ని రోడ్డున పడేసిందెవరో?

