విశాఖపట్నం: విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణాలపై పూర్తి విచారణ జరిపిస్తామని అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పష్టంచేశారు. భూ కుంభకోణం వ్యవహారంలో సంబంధం ఉన్న అధికారులు గానీ ప్రజాప్రతినిధులను గానీ విడిచి పెట్టమని హెచ్చరించారు. 

భూకుంభకోణంలో ఎంతటి వారు ఉన్నా వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. కానీ అక్కడ జరిగిన అవకతవకలకు మాత్రమే వ్యతిరేకమని తెలిపారు. 

అమరావతి రాజధాని పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. ఏపీ సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో నవరత్నాలకే పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. విద్య వైద్య అంశాలకు అత్యధికా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.  అనకాపల్లి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి.