కర్నూలు జిల్లాకే చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా ఆర్పీఎస్ తరపున అభ్యర్ధిని నిలబెడుతున్నట్లు ప్రకటించారు. ప్రకటనతో ఆగకుండా సమితి తరపున ప్రచారం కూడా మొదలుపెట్టేసారు. దాంతో పార్టీల మధ్య గందరగోళం మొదలైంది. తమ అభ్యర్ధి సిలిండర్ గుర్తుకే ఓట్లు వేయాలంటూ బైరడ్డి నంద్యాల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.
నంద్యాల ఉపఎన్నికలో టిడిపి-వైసీపీలు హోరాహోరీగా పోటీ పడుతుంటే మధ్యలో రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పిఎస్) పేరుతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్నికల్లోకి దిగారు. బైరెడ్డి కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన సీనియర్ రాజకీయ నేతన్న విషయం అందరికీ తెలిసిందే. రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ఓ సంస్ధను ఏర్పాటు చేసుకుని రాయలసీమ హక్కులని, జలాలని తరచూ ఏదో ఓ హడావుడి చేస్తూనే ఉంటారు లేండి. అయితే, ఆయనకున్న ఆధరణ అంతంతమాత్రమే.
అయితే, సాధారణ ఎన్నికలు వేరు ప్రస్తుత ఉపఎన్నిక వేరన్న సంగతి వేరుకదా? నంద్యాలలో గెలుపును టిడిపి, వైసీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి అయితే, ఇక్కడ గెలవకపోతే ప్రభుత్వమే కూలిపోతుందనో లేక తన 40 ఇయర్స్ ఇండస్ట్రీకే అవమానమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక, వైసీపీ తరపున గెలిచిన భూమానాగిరెడ్డి టిడిపిలోకి ఫిరాయించటం తర్వాత మరణించటం అందరికీ తెలిసిందే. దాంతో అనివార్యమైన ఉపఎన్నికలో మళ్లీ గెలిచి తమ స్ధానాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో జగన ఉన్నారు. కాబట్టే రెండు పార్టీలకు నంద్యాలలో గెలవటం ప్రిస్టేజ్ అయిపోయింది.
ఈ పరిస్ధితుల్లో తమకు పడతాయనుకున్న పది ఓట్లను కూడా వదులుకునేందుకు రెండు పార్టీల్లో ఏది కూడా సిద్దంగా లేదు. ఇటువంటి నేపధ్యంలో కాంగ్రెస్ కూడా పోటీ చేస్తోందని ప్రకటించి కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హీట్ పెంచారు. ఎందుకంటే, రెండు ప్రధాన పార్టీలు పోరాడుతున్నపుడు మధ్యలో కాంగ్రెస్ దూరిందంటే ఎన్నో కొన్ని ఓట్లు చీలటం ఖాయం. ఆ చీలే ఓట్లు ఎవరికి పడేవో చెప్పలేరు. దాంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులిద్దరిలో ఒకరికి విజయావకాశాలు తగ్గిపోవటం సహజం.
తాజాగా కాంగ్రెస్ ప్రకటనను పక్కన పెడితే కర్నూలు జిల్లాకే చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా ఆర్పీఎస్ తరపున అభ్యర్ధిని నిలబెడుతున్నట్లు ప్రకటించారు. ప్రకటనతో ఆగకుండా సమితి తరపున ప్రచారం కూడా మొదలుపెట్టేసారు. దాంతో పార్టీల మధ్య గందరగోళం మొదలైంది. తమ అభ్యర్ధి సిలిండర్ గుర్తుకే ఓట్లు వేయాలంటూ బైరడ్డి నంద్యాల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. తన ప్రచారంలో టిడిపి, వైసీపీ రెండింటిపై విరుచుకుపడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్, ఆర్పీఎస్ ల వల్ల లాభపడేది ఎవరు? నష్టపోయేది ఎవరనేది అంచనా వేసుకోవటంలో ముణిగిపోయారందరూ.
