కారణమిదే: చింతమనేని సైలెంట్, కోడి పందెలుంటాయా?
చింతమనేని ప్రభాకర్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. ఈ విషయమై ప్రస్తుతం చర్చ సాగుతోంది.
దెందులూరు: టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొంత కాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కేసులతో చింతమనేని ప్రభాకర్‌పై వరుస కేసులు నమోదయ్యాయి.
also read:నా తప్పని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా...
రెండు మాసాలు జైల్లోనే చింతమనేని ప్రభాకర్ గడిపాడు. ఇటీవలనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. చింతమనేని ప్రభాకర్ జైల్లో ఉన్న సమయంలో మాజీ మంత్రి నారా లోకేష్ ఆయనను పరామర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబునాయుడు చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసుల గురించి ప్రస్తావించారు.
సంక్రాంతి వచ్చిందంటే చింతమనేని ప్రభాకర్ దెందులూరులో హాడావుడి మామూలుగా ఉండేది కాదు. చింతమనేని ప్రభాకర్ సంక్రాంతిని పురస్కరించుకొని ప్రత్యేకంగా కోడి పందెలు నిర్వహించేవాడు.
పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్ స్టైలే వేరు. రాజకీయాల్లో చాలా దూకుడుగా చింతమనేని ప్రభాకర్ వ్యవహరించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ చింతమనేని ప్రభాకర్ పై కేసులు నమోదయ్యాయి.
అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడ చింతమనేని ప్రభాకర్‌పై కేసులు నమోదయ్యాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కేసుల్లో చింతమనేని ప్రభాకర్ అరెస్టయ్యాడు. ఈ కేసుల నుండి విడుదలయ్యే సమయంలో మరో కేసులో చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేశారు.
వరుస కేసులతో చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. దీంతో కొంత సైలెంట్‌గా ఉన్నట్టుగా దెందులూరు నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. సంక్రాంతి వస్తోంది. కోడి పందెం విషయమై చింతమనేని ప్రభాకర్ నోరు మెదపడం లేదు.
ఇప్పుడు కోడి పందెం గురించి చింతమనేని ప్రభాకర్ నోరు తెరిస్తే పోలీసులు కేసులు పెట్టే అవకాశం లేకపోలేదు. దీంతోనే చింతమనేని ప్రభాకర్ కోడి పందెం గురించి మాట్లాడడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి 2019 ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ఏపీ రాష్ట్రంలో టీడీపీ కూడ ఓటమి పాలైంది. అప్పటి నుండి చింతమనేని ప్రభాకర్‌కు కష్టాలు మొదలయ్యాయి.