66 రోజులు కారాగారంలో ఉన్నానని, తన ముందు ఎందరో హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు కూడా బెయిల్ పైన విడుదల అయ్యారని, రేప్ కేసుల్లో ఉన్నవారు కూడా విడుదలయ్యారని తాను చేసిన అంత పెద్ద తప్పేంటని ప్రశ్నించారు. 

జైలుకువెళ్లిన వ్యక్తి ఎందుకు వెళ్లానని బాధపడుతాడని, చంద్రబాబు అంటే జైలుకు వెళ్ళలేదు కాబట్టి ఆయనకు తెలియదు అనుకుందామని, 16 నెలలు జైల్లో ఉన్న జగన్ కి ఈ విషయం తెలియదా అని అన్నారు. తనను ఇంత మానసిక సంఘర్షణకు గురి చేశారని, రాష్ట్రప్రజానీకమంతా ఈ విషయాలను గమనిస్తున్నారని అన్నారు. 

also read ఎట్టకేలకు 66 రోజుల తర్వాత చింతమనేనికి బెయిల్

బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు రాజ్యాంగాన్ని రాసింది ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ, దేశం ప్రగతిపథంలో నడవాలని ఉద్దేశించారని అన్నారు. దళితుల హక్కుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఒక పార్టీని భూస్థాపితం చేయడానికి జగన్ మోహన్ రెడ్డి దుర్వినియోగపరుస్తున్నారని ఆక్షేపించారు. 

తాను గనుక తప్పుచేసానని మీడియా వారు గనుక విచారణ జరిపి నిరూపిస్తే ఎన్ని రోజులు జైల్లో ఉండమంటే అన్ని రోజులు జైల్లో ఉంటానని, లేదు తాను బ్రతకడానికి అనర్హుడనంటే ఈ ప్రపంచం నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని అన్నాడు.

తాను పిరికివాడిని కాదని, ఏ దళితుడి ఆస్తిని కూడా కాజేయాలని చూడట్లేదని అన్నాడు.అప్పటికే ఫైల్ అయిన ఛార్జ్ షీట్లను కూడా నంబరింగ్ కాలేదనే సాకు చూపెట్టి తనను ఏ-1 గా చేర్చిన మాట వాస్తవం కాదా అని ఆయన అన్నారు. తన అన్యాయాలను అక్రమాలను ఎమన్నా చేసుంటే, చేసినట్టు నిరూపితమైనా, సీరియల్స్ లాగా రోజుకోటి చొప్పున బయటపెట్టాలని, దయచేసి ప్రజలకు నిజం తెలిసేలా చేయండని కోరారు. 

also read అయప్ప మాలలో ఉండి కూడా వంశీ, అవంతీ చెప్పులేసుకుంటారు:వర్ల

తన నియోజకవర్గంలోని ఏ గ్రామంలోని దళిత వాడకు వెళ్లైనా సరే, తాను దళిత వ్యతిరేకిని అని నిరూపిస్తే కోర్టు తన కేసును  విచారణ చేయాల్సిన అవసరం లేదని, తానే ఒప్పుకుంటానని అన్నాడు. 

వనజాక్షిపై కూడా తప్పుగా ప్రవర్తించానని నిరూపిస్తే, ఏ శిక్షకైనా తాను సిద్ధమని అన్నారు. ప్రజలు తన ఫోటో పెట్టుకొని పూజించాలని కళకు కంటున్నారని, కాకపోతే ఆ కలల్లో చిత్తశుద్ధి ఉండాలని అన్నారు.సిలువపై ఏసుక్రీస్తు ఎంత నరకయాతన అనుభవించాడో, అంతే నరకయాతనను తాను జైల్లో అనుభవించానని అన్నాడు, పోలీసులతో జగన్ పొడిచిన చోట పాడవకుండా కుళ్ళబొడిపించాడని అన్నాడు.