Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు ఏమైంది ?

ఏపి రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ అప్పు ఇవ్వాలన్నారు.
What happened to chandrababu

చంద్రబాబునాయుడుకు ఏమైంది? ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, రాజధాని నిర్మాణానికి జనాలందరూ అప్పులివ్వాలట.

ఎందుకంటే, రాజధానినిర్మాణానికి బ్యాంకులు అప్పు ఇవ్వటం అయిపోయింది..కేంద్రం నిధులిచ్చేసింది..ఆర్ధిక సంస్ధల నుండి అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలూ అయిపోయాయి. అందుకే రాజధాని నిర్మాణానికి జనాలే అప్పు ఇవ్వాలని చంద్రబాబునాయుడు పిలుపిచ్చారు.

ఏపి రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ అప్పు ఇవ్వాలన్నారు. డబ్బులున్న వారు దాన్ని బ్యాంకుల్లో దాచుకోకుండా ప్రభుత్వానికి అప్పిస్తే అందుకు ప్రతిగా బాండ్లు జారీ చేస్తారట. బాండ్లు తీసుకున్న వారికి బ్యాంకులు చెల్లించే దానికన్నా అదనంగా మూడు శాతం అధికంగానే వడ్డీలు ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ విషయమై త్వరలోనే విధివిధానాలు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ప్రవాసాంధ్రులు, రాష్ట్ర ప్రయోజనాలను కోరుకునే ప్రతీఒక్కరూ సహకరించాలట. రైతులు భూములిచ్చిన విధంగానే ప్రజలు కూడా అప్పులివ్వాలట. విభజన చట్టం, హామీల అమలు కోసం ప్రతీఒక్కరూ ఏప్రిల్ 6వ తేదీ వరకూ నల్లబ్యాడ్జీలు ధిరంచాలన్నారు. ఉద్యోగులు అదనపుగంటలు పని చేయాలని పిలుపివ్వటం గమనార్హం.

అంతా బాగానే ఉందికానీ, రాజధానికి భూములిచ్చిన రైతులు ఇపుడు లబోదిబో అంటున్నారు. వాళ్ళగోడు పట్టించుకునే దిక్కేలేదు. రుణమాఫీ ఎంత సవ్యంగా జరుగుతోందో అందరూ చూస్తున్న జనాలు రాజధానికి అప్పులిస్తారా ?  

Follow Us:
Download App:
  • android
  • ios