Asianet News TeluguAsianet News Telugu

అంతుచిక్కని వ్యాధి : ఏలూరుకు సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్..

పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళలో అంతుచిక్కని వ్యాధి అంశం విచారించడానికి వైద్యాధికారులు ఏలూరు బయలుదేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్,వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కె.భాస్కర్ లు  ఏలూరు బయలుదేరి వెళ్లారు. 

west godavari mysterious disease cs adityanath das visiting to eluru - bsb
Author
Hyderabad, First Published Jan 22, 2021, 12:40 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళలో అంతుచిక్కని వ్యాధి అంశం విచారించడానికి వైద్యాధికారులు ఏలూరు బయలుదేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్,వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కె.భాస్కర్ లు  ఏలూరు బయలుదేరి వెళ్లారు. 

పూళ్ళలో అంతుచిక్కని వ్యాధికి సంబంధించి శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సియం ఆయా అధికారులతో సమీక్షించారు. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో వెంటనే వెళ్ళి పరిస్థితిని పరిశీలించాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ను సియం ఆదేశించడంతో సిఎస్ ఇతర అధికారులు హుటాహుటిన ఏలూరు బయలుదేరి వెళ్ళారు.

అంతేకాదు ఈ అంశానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం పూర్తి అప్రమత్తం చేయడంతో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు తెలిపారు.

సీఎం ఆదేశాల మేరకు సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ తోపాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి,శాఖ కమీషనర్లు  ఏలూరు పూళ్ళ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios