RGV: మరీ ఈ స్థాయిలోనా?.. పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ అరాచకం
పవన్ కళ్యాణ్, జనసేన పార్టీపై ఆర్జీవీ ఎక్స్ వేదికపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. జనసేనకు టీడీపీ 24 అసెంబ్లీ స్థానాలను మాత్రమే కేటాయించిందనే కోణంలో అనేక పోస్టులు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెట్టారు.
Janasena: జనసేన, టీడీపీలు పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాట్లపై కీలక ప్రకటనలు చేశాయి. ఏపీలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు టీడీపీ 24 సీట్లను కేటాయించింది. మిగిలిన వాటిలో టీడీపీ పోటీ చేయనుంది. అయితే.. బీజేపీ కూడా ఈ పార్టీలతో కలిసి రానున్నదని, బీజేపీ కూడా చేతులు కలిపిన తర్వాత ఆ పార్టీకి కూడా సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. జనసేనకు చాలా తక్కువ సీట్లు కేటాయించారని ఆ సమావేశం తర్వాతి నుంచే పెద్ద ఎత్తున అభిప్రాయాలు వచ్చాయి. జనసేన క్యాడర్, అభిమానులే కాదు.. అధికార వైసీపీ కూడా ఈ అంకెలను ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.
కాగా, ఆది నుంచీ పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై విరుచుకుపడుతున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. 24వ తేదీ నుంచి తీవ్ర స్థాయిలో ట్వీట్లు చేశారు. నాలుగు లక్షల వ్యూస్ వచ్చిన తొలి ట్వీట్.. ఇలా చేశారు వర్మ.. జనసేనకు 23 సీట్లు ఇస్తే, అది టీడీపీ లక్కీ నెంబర్ అంటారు. అదే 25
సీట్లు ఇస్తే పవన్‌ను పావలా సీట్లు ఇచ్చారని అంటారు. అందుకే మధ్యే మార్గంలో 24 సీట్లు ఇచ్చారు అని ఆర్జీవీ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
ఆ తర్వాత కూడా ట్వీట్లు పెడుతూ వెళ్లారు. 24 అసెంబ్లీ సీట్లతోపాటు మనకు 3 పార్లమెంటు స్థానాలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న క్లిప్‌ను కూడా ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఒక్కో పార్లమెంటు స్థానాల్లో ఆరు, ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయని, జనసేనకు తక్కువ సీట్లు వచ్చాయని భావించరాదని, ఒక లెక్కన చూస్తే జనసేనకు 45 సీట్లు ఇచ్చినట్టే అని కొంచెం కొత్తగా పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. ఈ వీడియోను ఆర్జీవీ పోస్టు చేసి.. రెండు లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానంతో అద్బుతమైన లాజిక్‌ను పవన్ తీశారని కామెంట్ చేశారు.
ఒక వేళ మూడు పార్లమెంటు స్థానాల పరిధిలోని ఏడు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా జనసేననే పోటీ చేస్తుందని అనుకుంటే మొత్తం జనసేన 45 స్థానాలలో పోటీ చేసినట్టు భావించాల్సి వస్తుందని, అలాగైతే.. టీడీపీ 303 స్థానాల్లో మరి 175 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ లెక్కఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. ఈ లెక్కకు ఏమైనా తిక్కుందా? అని వ్యంగ్యంపోయారు.
Also Read: LS Polls: దిల్ రాజుకు కాంగ్రెస్, బీజేపీ ఆఫర్లు!
ఈ రోజు పీకే కోసం బాధపడినంతగా తాను ఎవరికోసం బాధపడలేదని, ముఖ్యంగా జనసేన పరిస్థితి తలుచుకుంటూ దిగులు వేస్తుందని కామెంట్ చేశారు. అంతేకాదు, ఒక మీమ్ కూడా ఆయన పోస్ట్ చేశారు. 24 గంటలు జనానికి అందుబాటులో ఉంటానని చెప్పడానికే తాము 24 సీట్లు తీసుకున్నామని చెప్పే మీమ్‌ను ఆయన 25వ తేదీన ట్వీట్ చేశారు.