Asianet News TeluguAsianet News Telugu

వాగు దాటలేక... పెళ్లి వాయిదా వేసుకున్నారు..!

ఈ వివాహ వేడుకను శుక్రవారం తెల్లవారుజామును ఐదు గంటలకు గుట్టలోని శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో జరపాలని పెద్దలు నిర్ణయించారు. అంతక ముందు గురువారం రాత్రి రిసెప్షన్ కు  ఏర్పాట్లు జరిగాయి.

wedding canceled because of flood water in chittoor
Author
Hyderabad, First Published Nov 28, 2020, 9:03 AM IST

మరికాసేపట్లో పెళ్లి... ఆనందంగా మండపంలోకి అడుగుపెట్టాలని ఆశపడింది. కానీ.. తుఫాను కారణంగా వర్షాలు వరదల కారణంగా.. కొద్దిసేపట్లో జరగాల్సిన పెళ్లి మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  పాపేపల్లెకు చెందిన ఓ యువతికి బి. కొత్తకోట మండలం దేవరాజుపల్లెకు చెందిన సుధాకర్ కు పెళ్లి నిశ్చయమైంది. ఈ వివాహ వేడుకను శుక్రవారం తెల్లవారుజామును ఐదు గంటలకు గుట్టలోని శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో జరపాలని పెద్దలు నిర్ణయించారు. అంతక ముందు గురువారం రాత్రి రిసెప్షన్ కు  ఏర్పాట్లు జరిగాయి.

పాపేపల్లె నుంచి పెళ్లి కూతురు బంధువులు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు రెండు బస్సుల్లో గట్టుకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా ఎడతెరపి లేకుండా వాన కురవడంతో పాపేపల్లె వద్ద ఉన్న వాగు జోరుగా ప్రవహించి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయానికి కూడా పాపేపల్లె వాగు జోరు తగ్గకపోవడంతో పెళ్లి పెద్దలు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు. అనంతరం పెళ్లిని కూడా వాయిదా వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios