Asianet News TeluguAsianet News Telugu

బంగాళాఖాతంలో తుఫాను ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

భూమధ్యరేఖ వద్ద హిందూ మహా సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తుపాను ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈనెల 23 నాటికి అల్పపీడనం ఏర్పడగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

weather forecast to telugu states - bsb
Author
Hyderabad, First Published May 19, 2021, 11:53 AM IST

భూమధ్యరేఖ వద్ద హిందూ మహా సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తుపాను ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈనెల 23 నాటికి అల్పపీడనం ఏర్పడగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

తెలుగు రాష్ట్రాలలో నేడు ఉరుములు, మెరుపులతో చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. రేపు తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు కొనసాగుతాయి.

ఈనెల 23 న దక్షిణ కోస్తాంధ్ర తీరంలో సముద్రం అల్లకల్లోలం అవుతుంది. చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావారణ శాఖ తెలిపింది.

కాగా, ఇప్పటికే టౌటే తుఫాన్  ప్రభావంతో దేశంలో ఆరు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, పెనుగాలుల ధాటికి ఆయా రాష్ట్రాల్లో 14 మంది మరణించారు. సోమవారం  రాత్రి పొద్దుపోయిన తర్వాత  గుజారత్ తీరాన్ని తుఫాన్ తాకింది. 

ముంబై తీర ప్రాంతంలోని అరేబియా సముద్రంలో రెండు నౌకలు తుపాన్ కారణంగా లంగర్లు కొట్టుకొని సముద్రంలో కొట్టుకుపోయాయి. ఈ రెండు నౌకల్లోని 400 మంది సిబ్బందిని నేవీ అధికారుల రక్షించారు.  తుఫాన్ కారణంగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొన్ని గంటల పాటు మూసివేశారు. 

టౌటే ఎఫెక్ట్: ముంబై తీరంలో కొట్టుకుపోయిన రెండు నౌకలు, 410 మంది సిబ్బంది...

తుఫాన్ ప్రభావంతో మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో ఆరుగురు మరణించారు. రెండు పడవలు మునిగిన ఘటనలో ముగ్గురు నావికులు గల్లంతయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో ఎనిమిది మంది చనిపోయారు.  

కేరళ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో తుపాన్ ప్రభావం కన్పించింది. సోమవారం నుండి గుజరాత్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి.వర్షాలు, పెనుగాలులతో సెల్‌టవర్లు, విద్యుత్ స్థంబాలు, చెట్లు విరిగాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలు స్థంభించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios